logo

  BREAKING NEWS

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |  

పెళ్ళైన ఏడాదికే విషాదం..!

హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కూతురి పెళ్లి చేసిన ఏడాదికే ఆ తలిదండ్రులకు తీరని శోకం మిగిలింది. అత్తింటివారి వేధింపుల నేపథ్యంలో ఓ వివాహిత శవమై కనిపించింది. అయితే ఆమెది హత్యా? ఆత్మహత్యా? అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట నవోదయ కాలనీ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు కార్తిక్, లక్ష్మీ ప్రసన్నలకు పెద్దల సమక్షంలో 14 నెలల క్రితమే వివాహమైంది. కార్తీక్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కాగా లక్ష్మి ప్రసన్న ఈ సోమవారం రోజున అకస్మాత్తుగా ఇంట్లో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని అల్లుడే చంపాడని ఆరోపిస్తున్నారు. పెళ్లైన కొద్దీ రోజుల నుంచే తమ కూతురిని ఆదాయపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేసాడని వారు బోరున విలపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News