logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

ప్రేమోన్మాది దాడి: యువతి పరిస్థితి విషమం.. ఆ పరిచయమే కొంపముంచింది!

హైదరాబాద్ లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా మారింది. మంగళవారం రాత్రి యువతి, ఆమె తల్లిపై నిందితుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతి ఛాతి, కడుపు భాగంలో కత్తితో పొడిచాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువతి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టుగా వైద్యులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. నార్సింగి పరిధిలోని హైదర్ షా కోట్ లక్ష్మి నగర్ కు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన షారుక్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఛాలెంజ్ హబీబ్ అనే సెలూన్ లో షారుక్ పనిచేస్తుండగా అదే సెలూన్ కు యువతి తరచుగా వెళ్ళేది ఈ క్రమంలో ఏర్పడ్డ పరిచయంతోతనను ప్రేమించాలంటూ రెండేళ్లుగా ఆ యువతి ని వేధిస్తున్నట్టుగా సమాచారం.

గతంలో బాధితురాలు తన తండ్రితో కలిసి షారుక్ పై షీ టీమ్స్ కు ఫిర్యాదు చేసింది. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో యువతికి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన షారుక్ తనకు దక్కని యువతి మరెవరికీ దక్కకూడదని నిర్ణయించుకున్నాడు. మంగళవారం రాత్రి ఆమె నివసిస్తున్న అపార్ట్మెంట్ వద్దకు వెళ్లిన షారుక్ మాట్లాడాలంటూ ఆమెను కిందకు పిలిచాడు.

యువతి మాట్లాడుతున్న సమయంలోనే వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె పై దాడి చేసాడు. యువతి అరుపులతో ఆమె తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. అడ్డొచ్చిన తల్లిపై కూడా షారుక్ దాడి చేసాడు. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

 

Related News