logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

పెళ్ళికి ముందే బట్టతల వస్తుందని… దారుణం

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్ళికి ముందే జుట్టు రాలిపోతుంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ యువకుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు ఆత్మహత్యతో ఆ పేద కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన నితిన్ నగరంలో క్యాటరింగ్ పనులు చేసేవాడు. ఉప్పల్ లోని సత్య నగర్ కాలనిలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. వచ్చిన జీతం కుటుంబానికి పంపించి కొంత తాను దాచుకునేవాడు. ఇటీవల అతనికి విపరీతంగా జుట్టు రాలిపోతుండటంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఇంకా పెళ్లి కూడా కాలేదు అప్పుడే బట్టతల రావడంతో ఆందోళన చెందాడు.

అందుకోసం జీతంలో కొంత డబ్బును దాచుకుని హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకున్నాడు. కానీ అప్పటికే లాక్ డౌన్ రావడంతో వీలు పడలేదు. కాగా ఇటీవల సోదరి పెళ్లి కోసం డబ్బు పంపాలని తల్లిదండ్రులు కోరారు. అప్పటికే లాక్ డౌన్ కారణంగా ఉపాథి కోల్పోవడంతో మళ్ళీ అంత డబ్బు కూడబెట్టలేననుకున్నాడు. ఆ ఆలోచన అతన్ని మానసికంగా కుంగదీసింది. దీంతో క్షణికావేశంలో నితిన్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.

గదిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవ్వరూ కారణం కాదని జుట్టు ఓడిపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా లేఖలో రాసాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News