logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!

హైదరాబాద్ నగరానికి భారీ ముప్పు పొంచి ఉంది. నగరంలో నివసిస్తున్న 1. 30 కోట్ల మంది జనాభా ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు కరోనా మహమ్మారి నగరంలో అలజడి రేపింది. ఇప్పుడు కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. గతంలో ఒక్క హైద్రాబాదులోనే రోజుకు మూడు వేల కరోనా కేసులు నమోదు కాగా ఇప్పుడు ఆ సంఖ్య 150 కు చేరింది. ఇది కొంచెం ఊరట కలిగించే విషయమే అయినా రాష్ట్రంలో చలి వణికిస్తోంది. దానికి తోడు జనసాంద్రత అధికంగా ఉండే భాగ్యనగరంలో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

చలిగాలులు కరోనా విజృంభిస్తుందని ఓ వైపు అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు కనీసం మాస్కులు కూడా ధరించకుండా తిరుగుతుండటంతో మరోసారి కరోనా విరుచుకుపడనుందనే అనుమానాలు కలిగిస్తున్నాయి. వీటికి తోడు గ్రేటర్ పరిధిలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల హడావిడిలో పడి అసలు కరోనా ఉందన్న విషయాన్నే మరిచి పార్టీలు ప్రవర్తిస్తుండటంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా నిబంధనలు మరిచి భారీ ర్యాలీలు, ప్రచారాలు చేపట్టడంతో అధిక సంఖ్యలో జనం గుమిగూడుతున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని నెగిటివ్ అని తేలిన తర్వాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని తాజాగా హై కోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ కూడా దాఖలు చేసారు. ప్రచారంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్నారు.

ప్రస్తుతం కరోనా రెండో దశను ఎదుర్కుంటున్న ఢిల్లీ లో కూడా జనం నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెచ్చింది. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు జనం అధిక సంఖ్యలో హాజరవడం, స్థానిక మార్కెట్లలో సైతం కరోనా నిబంధనలు పాటించకపోవడంతో ఇప్పుడు అక్కడ కరోనా మళ్ళీ వణికిస్తోంది. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో భాగ్యనగరానికి కూడా అంతే ముప్పు పొంచి ఉందనే అభిప్రాయాలూ వెల్లడవుతున్నాయి. కరోనా ను చిన్నచూపు చూస్తే ఎన్నికలు ముగిసే సమయానికి కరోనా వైరస్ ట్రాన్స్ మిషన్ చేయిదాటే ప్రమాదం లేకపోలేదు. అయితే ఏది ఏమైనా కరోనా విజృంభిస్తే బలయ్యేది సామాన్య ప్రజలే కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజలు ఎవరికివారు జాగ్రత్తగా ఉంటేనే ఈ అపాయం నుంచి బయటపడగలం.

Related News