జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం అందుకున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నారు. కార్పొరేటర్లకుగా ఎన్నికైన వారు ఫిబ్రవరి 11 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం గెజిట్ ను కూడా విడుదల చేసింది.
అయితే బీజేపీ మాత్రం కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడుతుంది. వాస్తుదోషం ఉందని సచివాలయాన్ని కూల్చేసిన తెలంగాణ ప్రభుత్వానికి తమ సెంటిమెంట్లు పట్టవా అంటూ విమర్శిస్తోంది. కొందరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆరోజున ప్రమాణ స్వీకారం చేయబోమని అవసరమైతే పార్టీ పెద్దల నుంచి అనుమతులు తీసుకుంటామని అంటున్నారు. అందుకు కారణం ఆ రోజు అమావాస్య కావడమేనట. అమావాస్య రోజున ఏ పని మొదలు పెట్టినా విఘ్నాలు కలుగుతాయని అంటున్నారట.
ప్రభుత్వం తీరుపై బీజేపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. మజ్లీస్ అధినేత చెప్పినట్టుగా కేసీఆర్ వింటున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై కొందరు కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసారు. అయితే మజ్లీస్ కార్పొరేటర్లు మాత్రం అమావాస్య రోజున ప్రమాణ స్వీకారం చేయడం పై తమకేమీ అభ్యంతరం లేదని అంటున్నారు.