logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కరోనా దెబ్బకు హైదరాబాద్ లో మరో ప్రాంతం మూసివేత!

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కు ఇప్పుడిప్పుడే సడలింపులు ఇస్తుంది ప్రభుత్వం. అయితే లాక్ డౌన్ లో కరోనా కేసులు తగ్గుతాయని భావించిన ప్రభుత్వాలకు చుక్కెదురైంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాగా రాష్ట్రంలోని జంట నగరాల్లో కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 800 లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా ఉన్నాయి. తాజా పరిణామాలతో ప్రజలు బయటకు వెళ్ళడానికి జంకుతున్నారు.

అటు వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను అమలు చేసుకుంటున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ జనరల్ బజార్ ను మూసివేశారు. వచ్చే నెల 5 వరకు సికింద్రాబాద్, ప్యారడైజ్, జనరల్ బజార్, సూర్య టవర్స్ ను మూసివేస్తూ వ్యాపారాలు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ నెల 28వ తేదీ నుండి బేగంబజార్ ను మూసివేయాలని హైద్రాబాద్ కిరాణ వ్యాపారుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు కేసులు కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. అయితే తెలంగాణలో మాత్రం మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఖజానాలు ఖాళీ అవ్వడంతో ఆదాయం లేకుండా పోయిందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

Related News