logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

భారీ వర్షాలకు నిండిన హుస్సేన్ సాగర్.. ఈ ప్రాంతాల వారికి అలర్ట్!

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. భారీగా వరద మీరు వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తూముల ద్వారా వరద నీటిని దిగువకు వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు లుంబినీ పార్కులోకి కూడా భారీగా నీరు వచ్చి చేరింది. కాగా ఈరోజు హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి వేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

గత అనుభవాల దృష్ట్యా భారీగా ఇప్పటికే సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. సాగర్ నీటి ఎఫ్టీఎల్ లెవెల్ 513. 41కాగా ప్రస్తుతం ఇది 513.64 మీటర్లకు చేరింది. రెండు అలుగులు, తూముల ద్వారా నీటిని లోతట్టు ప్రాంతాలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నా.. చెత్త అడ్డు పడుతుండటంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యంగా మారుతుంది.

అందుకోసం అక్కడ జీహెచ్ ఎంసీ సిబ్బంది చెత్తను ఏరివేసే పనిలో ఉన్నారు. అయినా కూడా వరద ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో సాగర్ ప్రాంతాల్లో అధికారులు అలెర్ట్ అయ్యారు. కాగా నగరంలోని అశోక్ నగర్, హబ్సిగూడ, నల్లకుంట ఏరియా లోకి వరద నీరు వెళ్లే అవకాశాలున్నాయని ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు.

Related News