logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఫెయిర్ అండ్ లవ్లీ లో ఇకపై ‘ఫెయిర్’ ఉండదు.. హెచ్‌యూఎల్ సంచలన నిర్ణయం!

భారతీయ దిగ్గజ ఎఫ్ ఎంసీజీ సంస్థల్లో హిందుస్థాన్ యూనీలీవర్ ఒకటి. దశాబ్దాలుగా తమ వినియోగదాయులకు నాణ్యమైన సేవలు అందిస్తూ పేరు గడించింది. తాజాగా ఈ సంస్థ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరుతొ విక్రయించే క్రీముకు మంచి మార్కెట్ ఉంది. తాజాగా ఈ బ్రాండ్ పేరును మారుస్తునట్టుగా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లుగా ఫెయిర్ అండ్ లవ్లీ పేరుతో విక్రయిస్తున్న ఈ బ్రాండ్ పేరును ఇంత హఠాత్తుగా ఎందుకు మార్చవలసి వచ్చింది అంటే దాని వెనక పెద్ద కారణమే కనిపిస్తుంది.

ఇటీవల అమెరికాలో నల్ల జాతీయులపై వివక్షకు నిరసనగా ‘బ్లాక్ లైఫ్స్ మాటర్’ అనే ఉద్యయం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి అమెరికా ప్రజలు కూడా మద్దతు తెలిపారు. అందులో భాగంగా అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఇటీవల భారత్ కు చెందిన రెండు ఫెయిర్ నెస్ క్రీముల బ్రాండ్లను నిషేదించింది. ఇకపై అమెరికాలో రంగును మెరుగుపరుస్తామని తెలిపే ఏ బ్రాండ్ ను కూడా అనుమతించబోమని వెల్లడించింది. సోషల్ మీడియాలో కూడా భారతీయులు ఈ ప్రాడక్టులపై, ఈ ప్రకటనల్లో నటించే హీరోయిన్లపై సెటైర్లు వేస్తున్నారు.

దీంతో ముందుగానే మేల్కొన్న హిందుస్థాన్ యూనీలీవర్ తమ బ్రాండ్ పేరును మార్చబోతున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు ఇకపై ఫెయిర్ అండ్ లవ్లీలో ఫెయిర్ ఉండదు. అంతేకాదు ఈ ప్యాక్ పై దర్శనమిచ్చే తెలుపు, నలుపు ముఖాలు కూడా ఇకపై కనిపించవు. అన్ని బ్యూటీ ప్రాడక్ట్స్ నుండి తెలుపు, మెరుపు ఇలా రంగుకు సంబందించిన పేర్లను తొలగిస్తుంది. ఇకపై అన్ని రకాల శరీర రంగులకు గౌరవమిచ్చేలా కొత్తగా బ్రాండ్ ను మార్చనున్నామని సంస్థ ప్రకటించింది.

Related News