logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

సామాన్యుడికి మరో బాడ్ న్యూస్.. కేజీ చికెన్ ధర తెలిస్తే షాకే!

బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటుగా ఇప్పుడు చికెన్ ధరలు కూడా సామాన్యుడికి షాకిస్తున్నాయి. తెలంగాణలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత వారం 160 నుంచి 180 మధ్యన ఉన్న కేజీ చికెన్ ధర ఇప్పుడు ఏకంగా 50 రూపాయలకు పైగా పెరిగింది.

బోన్ లెస్ చికెన్ ధర రూ. 350- 370 గా ఉంది. ఈ వార్త చికెన్ ప్రియులను ఆవేదనకు గురి చేస్తుంది. గత ఆదివారంతో పోలిస్తే ఈ వారం కేజీ చికెన్ ధర రూ. 250 గా ఉంది. గతంలో బర్డ్ ఫ్లూ ప్రచారంతో కోళ్ల ఉత్పత్తిని తగ్గించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అదే సమయంలో డిమాండ్ పెరిగిపోయింది.

రెండేళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాలను చవి చూస్తుంది. ఇదే సమయంలో కరోనా మరింత దెబ్బతీసింది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ కారణంగా సమస్యలు ఎదుర్కొన్నామని పౌల్ట్రీ రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా పెరిగిన చికెన్ ధరలు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి.

Related News