logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కేజీ అమ్మితే రూ. లక్ష గ్యారెంటీ!

సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఏది నిజమో ఏది నకిలీ వార్తో కనిపెట్టడం కష్టంగా మారుతుంది. ఇటీవల బీహార్ కు చెందిన రైతు ఒకరు హాఫ్ షూట్స్ అనే పంట వేసి లక్షల్లో సంపాదిస్తున్నాడని ఓ వార్త వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఈ వార్త నకిలీదని తేలింది. బీహార్ లో ఇలాంటి పంట పండిస్తున్న రైతు ఎవ్వరూ లేరని తేలింది. నిజాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచారం చేసి మీడియా సంస్థలు కూడా బోల్తా కొట్టాయి. అయితే ఈ వార్తలో నిజం లేకపోయినా హాఫ్ షూట్స్ అనే పంటకు ఉన్న గిరాకీ మాత్రం నిజమే. నిజంగానే ఈ పంట ధర కేజీకి లక్ష రూపాయలు పలుకుతుంది. దీనిని ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పంటగా చెప్తారు.

ఈ పేరు మనకు కొత్త కావచ్చు కానీ పాశ్చాత్య దేశాల్లో దీనికి భలే గిరాకీ ఉంది. కూరగాయాలలోనే ఇదో రకం పంట. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో హాప్ షూట్స్ ను ఎక్కువగా వినియోగిస్తారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో ఆయా దేశాల్లోని బ్యూటీ ప్రాడక్ట్స్ లో కలుపుతారు. ఎంత ఖరీదైన పంట అయినా కేజీ వెయ్యి రూపాయల లోపే ఉంటుంది. కానీ ఏకంగా కేజీకి లక్ష చెల్లించి కొనేంతగా ఇందులో ఏముంది? అంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

హాప్ షూట్స్ పూలు, కాడలు, పండ్లలో ఔషధ గుణాలు ఉండటం వల్ల వీటిని యాంటీ బయోటిక్స్ మందుల తయారీకి వినియోగిస్తారు. టీబీ, క్యాన్సర్, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి లాంటి వ్యాధులను నయం చేయడానికి కూడా వాడతారు. బీరులో ఆ కిక్కిచ్చే వాసన రావడానికి హాఫ్ షూట్స్ పూలను వాడతారు. వీటిలో ఉండే ప్రత్యేక గుణాలు బీరుకు ఆ వాసనను కలిగిస్తాయి. మానసిక సమస్యలకు ఇది మంచి మందుగా పని చేస్తుంది. ఒకప్పుడు ఔషదాల తయారీలో మాత్రమే హాప్ షూట్స్ ను వీటి ప్రయోజనాల గురించి తెలిసి ఇప్పుడు వంటల్లో కూడా విరివిగా వాడుతున్నారు. అందుకే ఈ పంటకు భారీగా డిమాండ్ ఏర్పడింది.

వంటలలో వీటి కాడలను ఉపయోగిస్తుంటారు. అయితే చూడటానికి కనకాంబరం పూల కాడల్లా కనిపించే ఇవి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. బరువు కూడా చాలా తేలికగా ఉంటాయి. కేజీ కొనాలంటే ఒక పెద్ద సంచి నిండిపోతుంది. పంట కోయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నపని. చాలా చిన్నగా ఉండే వీటి తీగల నుంచి కాయలు వేరు చేయాలంటే గంటల కొద్దీ నడుము వంచి పని చేయాల్సి ఉంటుంది. అందుకే ఎక్కువ మొత్తంలో కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పంటకు డిమాండ్ కు సరిపడా సప్లై లేదు. అందువల్ల ఈ పంటను పండించిన వారు రాత్రికి రాత్రి లక్షాధికారులు అయిపోతున్నారు. ఈ పంట పండించాలంటే వాతావరణం చల్లగా ఉండాలి. మార్చి నుంచి జూన్ మధ్య పంట సాగు చేస్తుంటారు. తగినంత తేమ, సూర్యరశ్మి ఉంటే మొక్కలు వేగంగా పెరుగుతాయి. రానున్న కాలంలో వ్యవసాయ రంగంలో సిరుల పంటగా హాఫ్ షూట్స్ మారే అవకాశాలు లేకపోలేదు.

Related News