logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

సిబిల్ స్కోర్ అంటే ఏమిటి ? సిబిల్ స్కోర్‌ను వేగంగా ఎలా పెంచుకోవాలి ?

మ‌నం ఓ బైక్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఈఎంఐ ప‌ద్ధ‌తిలో కొనాల‌ని షోరూంకి వెళ్లిన‌ప్పుడు లోన్లు ఇచ్చేందుకు ప‌లు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌ల ప్ర‌తినిధులు క‌నిపిస్తారు. లోన్ కావాలి అని అడిగిన‌ప్పుడు మ‌న వివ‌రాలు తీసుకొని వెంట‌నే చెక్ చేసి మ‌న‌కు లోన్ వ‌స్తుందో, రాదో చెప్పేస్తారు. మ‌న‌లో చాలా మందికి లోన్ ఇవ్వ‌లేమ‌ని ఖ‌రాకండీగా చెబుతారు. ఇందుకు కార‌ణం సిబిల్ స్కోర్ త‌క్కువ ఉండ‌ట‌మే. చిన్న లోన్లే కాదు హౌజ్ లోన్‌, బిజినెస్‌, ప‌ర్స‌న‌ల్ లోన్లు ఏవి కావాల‌న్నా సిబిల్ స్కోర్ ముఖ్య‌మైన‌ది. అస‌లు, ఏంటి ఈ సిబిల్ స్కోర్‌, మ‌న స్కోర్ ఎలా తెలుసుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనే విష‌యాలు ఓ సారి చూద్దాం.

సిబిల్ అంటే ఏమిటి ?
సిబిల్ అంటే క్రెడిట్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో ఇండియా లిమిటెడ్‌. ఇది ఒక క్రెడిట్ బ్యూరో. అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌లు ఇచ్చే లోన్లు, అప్పుల‌కు సంబంధించిన అన్ని రికార్డులు ఈ సంస్థ ద‌గ్గ‌ర ఉంటాయి. మ‌నం ఒక‌సారి ఏదైనా లోన్ తీసుకుంటే మ‌నం తీసుకున్న బ్యాంక్ ద్వారా మ‌న వివ‌రాలు ఈ సంస్థ వ‌ద్ద‌కు వెళ‌తాయి. ఇలా లోన్లు తీసుకున్న ప్ర‌తి ఒక్క‌రి వివరాల‌ను ప్ర‌త్యేకంగా ఈ సంస్థ న‌మోదు చేసుకుంటుంది. మ‌నం తీసుకున్న లోన్ మొత్తం ఎంత‌, ఎన్ని ఈఎంఐలు క‌ట్టాలి, ఎంత క‌ట్టాలి, ఎన్ని క‌ట్టాము, ఎన్నిసార్లు క‌ట్ట‌లేక‌పోయాము అనే వివ‌రాలు అన్నీ ఈ సంస్థ వ‌ద్ద ఉంటాయి.

సిబిల్ స్కోర్ ఎలా ఇస్తారు ?
నిజానికి అంద‌రూ సిబిల్ స్కోర్ అని పిలుస్తారు కానీ ఇది క్రెడిట్ స్కోర్‌. సిబిల్ సంస్థ ఇచ్చే స్కోర్‌ను సిబిల్ స్కోర్ అని పిలుస్తారు. సిబిల్ మాత్ర‌మే కాదు సీఆర్ఐఎఫ్‌, ఎక్స్‌పీరియెన్ వంటి సంస్థ‌లు కూడా క్రెడిట్ స్కోర్‌ను ఇస్తాయి. కానీ, సిబిల్ ఇచ్చే స్కోర్‌నే చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌లు ప్రామాణికంగా తీసుకుంటాయి. సిబిల్ వ‌ద్ద ఉండే మ‌న రికార్డుల ఆధారంగా సిబిల్ మ‌న క్రెడిట్ స్కోర్‌ను ప్ర‌తి నెల ఖ‌రారు చేస్తుంది. మ‌నం తీసుకున్న లోన్లు, చెల్లించిన‌, చెల్లించ‌లేని ఈఎంఐలు, క్రెడిట్ కార్డు వినియోగం వంటి అంశాల ఆధారంగా మ‌నకు సిబిల్ ఒక స్కోర్ ఇస్తుంది.

సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి ?
సాధార‌ణంగా సిబిల్ 300 నుంచి మొద‌లై 900 వ‌ర‌కు ఉంటుంది. 300 నుంచి 549 వ‌ర‌కు సిబిల్ స్కోర్ ఉంటే బాగ‌లేదు, పూర్ అని చెబుతుంది. 550 నుంచి 700 వ‌ర‌కు ఉంటే ఫ‌ర్వాలేదు, ఫెయిర్ అని ప‌రిగ‌ణిస్తుంది. అయితే ఏ లోన్ అయినా సులువుగా రావాలంటే మాత్రం సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉండాలి. ఇలా ఉంటే బ్యాంకులు మ‌న‌కు లోన్లు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తాయి.

సిబిల్ స్కోర్ పెర‌గాలంటే ఏం చేయాలి ?
ఐదు ప‌ద్ధ‌తుల‌ను పాటించ‌డం ద్వారా సిబిల్ స్కోర్‌ను పెంచుకునే అవ‌కాశం ఉంటుంది.

1. మ‌నం ప్ర‌తి నెల క‌ట్టాల్సిన బ్యాంకు వాయిదాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా క‌ట్టేయాలి. మ‌రిచిపోకుండా అవ‌స‌ర‌మైతే రిమైండ‌ర్ పెట్టుకొని మ‌రీ ఈఎంఐల‌ను చెల్లించాలి. సిబిల్ స్కోర్‌లో ఇదే కీల‌కం.

2. మొత్తానికి లోన్లు తీసుకోక‌పోతే సిబిల్ స్కోర్ పెరుగుతుంద‌ని, త‌మ క్రెడిట్ హిస్ట‌రీ బాగుంటుంద‌నే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ, ఇది నిజం కాదు. సిబిల్ స్కోర్ పెర‌గాలంటే చిన్న‌వో, పెద్ద‌వో లోన్లు తీసుకోవాలి. అవి క్ర‌మం త‌ప్ప‌కుండా క‌ట్టాలి. కాబ‌ట్టి, మీకు అవ‌స‌రం అయితే లోన్లు తీసుకునేందుకు వెన‌కాడొద్దు.

3. క్రెడిట్ కార్డు వినియోగ‌దారులు సిబిల్ స్కోర్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. క్రెడిట్ కార్డు లిమిట్‌లో 30 శాతానికి మించి వాడుకోవ‌ద్దు. క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎంల నుంచి డ‌బ్బులు తీసుకోవ‌ద్దు. క్రెడిట్ కార్డు లిమిట్ ఎక్కువ వాడుకుంటే సిబిల్ స్కోర్ త‌గ్గిపోతుంది.

4. లోన్లు అవ‌స‌రం ఉన్న‌వారు త‌ర‌చూ లోన్ల‌కు అప్లై చేసి, రిజెక్ట్ అయిన త‌ర్వాత మ‌ళ్లీ మ‌ళ్లీ అప్లై చేస్తుంటారు. ఇది అస్స‌లు చేయ‌వ‌ద్దు. మ‌నం ఎన్నిసార్లు లోన్ల‌కు అప్లై చేశాము, ఎన్నిసార్లు రిజెక్ట్ అయ్యింది అనేవి సిబిల్ స్కోర్‌పై ప్ర‌భావం చూపుతాయి.

5. ఎక్కువ లోన్లు తీసుకొని, క్ర‌మం త‌ప్ప‌కుండా తిరిగి చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. కానీ, ఒకే స‌మ‌యంలో ఎక్కువ లోన్లు తీసుకోవ‌ద్దు. లోన్ ఇస్తామ‌ని చెప్పిన అంద‌రి వ‌ద్ద లోన్లు తీసుకుంటే మ‌నం అప్పు కోసం అర్రులు చాస్తున్నామ‌ని అర్థం. కాబట్టి సిబిల్ స్కోర్ త‌గ్గిపోతుంది.

Related News