logo

  BREAKING NEWS

ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |   ప్రధాని మోదీ వేయించుకున్న వాక్సిన్ ఏదో తెలుసా?  |   శ‌భాష్‌ జ‌గ‌న్‌.. ఈ ఒక్క నిర్ణ‌యంతో మ‌రో మెట్టు ఎక్కేశావు  |   పెట్రోల్ పంపులో మ‌న‌కు ఇవ‌న్నీ ఉచితంగా ఇవ్వాల్సిందే  |   శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. 26-02-2021 బంగారం ధ‌ర‌లు  |   నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా ఫట్టా?  |   బ్రేకింగ్: ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా కేసులో యువతి ఆత్మహత్య!  |   కుప్పంలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. షాకివ్వనున్న కీలక నేతలు!  |  

మీ దగ్గరున్న రూ. 2000 వేల నోటు అసలైనదేనా? ఎలా గుర్తించాలి? నకిలీదైతే ఏం చెయ్యాలి?

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి నకిలీ నోట్లు వచ్చి పడిపోతుంటాయి. ఒకవేళ మన దగ్గరున్న నోటు నకిలీనే అయితే అది చిత్తు కాగితంతో సమానం. పోనీ గుర్తించి బ్యాంకుకు వెళ్తే వారు దానిని తీసుకుని చింపివేయడమో.. అడ్డంగా గీతకొట్టి పడేయడమో చేస్తారు. దీనివల్ల కూడా నష్టపోయేది మనమే. అందుకే నకిలీ నోట్ల బారిన పడకుండా వినియోగదారుల కోసం ఆర్బీఐ ఓ ప్రకటన చేసింది. ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్లో అందుకు సంబందించిన కొన్ని సూచనలు చేసింది.

మహాత్మాగాంధీ కొత్త సిరీస్ లో భాగంగా కొత్త రూ. 2000 వేల నోట్లను తీసుకువచ్చింది ఆర్బీఐ. ఈ నోటు సైజు 66mm x 166mm ఉంటుంది. దీనితో పాటుగా మీ దగ్గర ఉన్న రెండు వేల నోటు అసలైనదే అని తెలిపే విధంగా 17 గుర్తులను ఆర్బీఐ సూచించింది. ఆ గుర్తుల్లో ఏ ఒక్క గుర్తు నోటుపై లేకపోయినా దానిని నకిలీ నోటుగా అనుమానించాల్సిందే. ఆ గుర్తులు ఏమిటి? ఎలా పరిశిలించాలో తెలుసుకుందాం..

1. రెండు వేల నోటుకి ఎడమవైపున నిలువుగా 2000 అని రాసి ఉన్న నంబర్ కనిపిస్తుంది.
2. దానికి కొంచెం కింద భాగంలో జాగ్రత్తగా గమనించి చూస్తే 2000 అని కనిపించకుండా రాసి ఉంటుంది.
3. రెండో గుర్తుకు పై భాగంలో అడ్డంగా దేవనాగరి లిపిలో ₹२००० అని కనిపిస్తుంది.
4. నోటుకు మధ్యలో మహాత్మా గాంధీ బొమ్మ ముద్రించి ఉంటుంది.
5. ఈ గాంధీ బొమ్మను జాగ్రత్తగా ఆగమనించి చూస్తే హిందీలో భారత్, ఇంగ్లీష్‌లో India అనే పదాలు కనిపిస్తాయి.
6. మహాత్మాగాంధీ బొమ్మ పక్కన సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. అందులో భారత్ అని హిందీలో, ఆర్బీఐ, 2000 అని కనిపిస్తుంది. ఈ సెక్యూరిటీ థ్రెడ్ గ్రీన్ కలర్ నుంచి బ్లూ కలర్ లోకి మారుతున్నటుగా కనిపిస్తుంది.
7. సెక్యూరిటీ థ్రెడ్ పక్కనే ఆర్బీఐ గవర్నర్ సంకేతకం ఉండాలి. అలాగే సనకం కింద ఆర్బీఐ ఎంబ్లెమ్ ఉండాలి.
8. ఆ పక్కన ఖాళీగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ అందులో మహాత్మాగాంధీ చిత్రంతో పాటుగా 2000 నంబర్ వాటర్ మార్కులాగా ఉంటుంది. ఈ గుర్తులను కాస్త వెలుతురులో చూస్తే కనిపిస్తాయి.
9. రెండు వేల నోటుకు కుడివైపు కింద భాగంలో కరెన్సీ నోట్ సీరియల్ నంబర్ ఉంటుంది. ఈ నెంబర్ సైజు చిన్న నుంచి పెద్దగా
ఉంటుంది. ప్రతీ నోటుకు వేర్వేరు నెంబర్లు ఉంటాయి. ఒకే నెంబర్‌తో రెండు నోట్లు ఉండవు.
10. కరెన్సీ నోటు సీరియల్ నెంబర్ పైన రూపీ గుర్తు, 2000 నెంబర్‌తో ₹2000 కనిపిస్తుంది.
11. రూ.2000 నోటులో కుడివైపు కింద అశోక స్తంభం ఉంటుంది.
12. అంధులు కరెన్సీ నోటును గుర్తించేందుకు నల్లని లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ రెండువైపులా కనిపిస్తాయి.
13. ఎడమవైపు కరెన్సీ నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది.
14. తెల్లని స్పేస్ కింద స్వచ్ఛ్ భారత్ లోగో, నినాదం ఉంటాయి.
15. లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో తెలుగు సహా 15 భాషల్లో రెండు వేల రూపాయలు అని రాసి ఉంటుంది.
16. మధ్యలో మంగళ్‌యాన్ చిత్రం ఉంటుంది.
17. ఎడమవైపు పైన దేవనాగరి లిపిలో ₹२००० అని కనిపిస్తుంది.

దురదృష్టవశాత్తు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకున్నప్పుడు నకిలీ నోటు అని అనుమానం కలిగితే వాటిని వెంటనే ఆ ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ కెమెరా వైపు చూపించాలి. దీనివల్ల అది రిజిస్టర్ అవుతుంది. తర్వాత అక్కడున్న గార్డుకు ఫిర్యాదు చేయాలి. ఆ వెంటనే సంబంధిత బ్యాంకుకు, ఆర్బీఐకి, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఏటీఏం నుంచి డబ్బులు డ్రా చేసుకునే సమయంలో వచ్చిన స్లిప్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. విచారణకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. విచారణలో ఆ నోటు ఏటీఎం నుంచే వచ్చిందని తేలితే వినియోగదారుడికి దాని స్థానంలో అసలు నోటు ఇచ్చే అవకాశం ఉంది.

Related News