logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

ఈ పదార్థాలలో ఏది కల్తీ? ఏది అసలు? క్షణాల్లో తెలుసుకోండి.. కల్తీపై నష్ట పరిహారం ఎలా పొందాలి?

నిత్యావసరాల పదార్థాలను కల్తీ చేసి అమ్మడం చట్టరీత్యా నేరం. కల్తీ చేసిన ఆహారం వలన కొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న పాలు, నెయ్యి, బియ్యం, పప్పు దినుసులు ఇలా ప్రతీది కల్తీమయంగా మారుతుంది. కల్తీ ఆహారంగా తీసుకోవడం వలన దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులు వస్తాయి. మనందరం రోజు వాడే పదార్థాలు కల్తీవే అయ్యుండొచ్చు. కానీ వాటిని గుర్తించడం కష్టం. మరి వాటిని ఎలా గుర్తించాలి తెలుసుకుందాం..

చక్కెర:

చక్కెరలో సుద్ద ముక్కల పొడి లేదా బొంబాయి రవ్వను కలుపుతుంటారు. అసలైన చక్కెరను గుర్తించాలంటే కొంచెం చక్కెరను తీసుకుని ఒక గ్లాసులో వేయండి. చక్కర నీటిలో కరగకుండా అడుగున రవ్వ లాంటి మిశ్రమం ఏదైనా ఉంటె అందులో కల్తీ జరిగినట్టుగా గుర్తించాలి.

పాలు:

పాలలో డిటెర్జంట్లు, సబ్బును కలుపుతారు. అందువల్ల ఈ పాలు తాగిన పిల్లల్లోఅనేక సమస్యలు వస్తాయి. ఆడ పిల్లలు త్వరగా రజస్వల కావడం, చిన్నవయసులోనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ లాంటి సమస్యలు వెంటాడతాయి. 10 మిల్లి లీటర్ల పాలకు సమానమైన నీటిని కలిపి పైకి కిందకు ఉపాలి. అప్పుడు అందులో దట్టమైన నురగ కనిపిస్తే సబ్బు కలిపింది. తేలికపాటి నురగ వస్తే అసలైంది. ఒక వేళ పాలలో నీళ్లు కలిపినట్టయితే ఒక చుక్క పాలను ఏదైనా ఏటవాలుగా ఉన్న వస్తువుపై వేసి చూడండి నీళ్లు కలిపితే కిందకు జారుతుంది. నీళ్లు కలపని పాలు అలాగే నిలిచి ఉంటుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెను తలకు మాత్రమే కాకుండా కొందరు వంటల్లో కూడా వాడుతుంటారు. అలాంటి నూన్ కల్తీ జరిగితే అది మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే ఒక సారి మీరు వాడుతున్న కొబ్బరి నూనెను ఫ్రిడ్జ్ లో ఉంచండి. అది అసలైనదైతే గడ్డకడుతుంది. కల్తీ అయితే ఎంత సేపు ఫ్రిడ్జ్ లో ఉంచినా గడ్డకట్టదు.

జీలకర్ర, ధనియాల పొడి:

జీలకర్ర ను రెండు చేతుల మధ్య ఉంచి నలిపితే చేతికి రంగు అంటకూడదు. ఆలా జరిగితే అందులో రంగు లేదా కెమికల్స్ కలిపినట్టుగా గుర్తించాలి. ఇలాంటి వాటిని వంటల్లో వినియోగిస్తే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఖాయం. ధనియాల పొడిని కల్తీ చేసేందుకు రంపపు పొట్టును వాడుతుంటారు. చెంచాడు ధనియాల పొడిని నీటిలో వేసి ఉంచండి కల్తీ అయితే రంపపు పొట్టు నీటిపై తేలుతూ కనబడుతుంది. ఇలాంటి పొడిని వంటల్లో వాడితే జీర్ణాశయ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

బెల్లం, పన్నీర్:

బెల్లాన్ని స్వచ్ఛమైనదిగా చూపించేందుకు అందులో మెటాలిక్ పసుపు రంగును వాడుతుంటారు. కొద్దిగా బెల్లం ముక్కను నీటిలో వేసి కరగనివ్వాలి. కల్తీ జరిగినట్లయితే అడుగు భాగంలో పసుపు మిశ్రమం కనిపిస్తుంది. గోధుమ పిండిని కూడా ఇలాగే చేసి చూడాలి. పై భాగంలో పిండి తేలియాడుతూ ఉంటె అది కల్తీ అని పూర్తిగా నీటిలో కలిస్తే అది స్వచ్ఛమైనది గుర్తించాలి. మనం ఎంతో ఇష్టంగా వాడే పనీర్ ను కూడా కల్తీ చేస్తారు. కల్తీ లేని పన్నీర్ రుచి కొద్దిగా తీపిగా ఉంటుంది.

కారం, తేనె:

కారంలో చక్కర పొట్టు, రంగులను వాడుతుంటారు. దానిని కనుగొనేందుకు కూడా నీటితోనే పరీక్షించాలి. కల్తీ లేని కారం అడుగు భాగంలోకి చేరుతుంది. చెక్కపొట్టు, రంగులు కలిపితే మాత్రం పై భాగంలో కనిపిస్తుంది. తేనెలో నీరు, చక్కర కలిపి కల్తీ చేస్తారు. దీని నాణ్యతను పరీక్షించడానికి ఒక పత్తితో తయారు చేసిన వత్తిని తీసుకుని తేనెలో పూర్తిగా ముంచి వెలిగించాలి. అది వెలిగితే నాణ్యమైనదని, వెలగకుండా చిటపటలాడుతుంటే కల్తీదని గుర్తించాలి.

ఫిర్యాదు చేయండి ఇలా..

వీలైనంత వరకు వినియోగదారులు అగ్ మార్క్ ఉన్న పదార్థాలనే కొనాలి. అగ్ మార్కు అంటే అది ప్రభుత్వం తరపున నాణ్యతపై ఇచ్చే భరోసా లాంటిది. మీరు వినియోగించే పదార్థాలలో ఏదైనా కల్తీ అని అనుమానిస్తే వినియోగదారులు వెంటనే అగ్ మార్క్ లేదా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ లలో టెస్టింగ్ కు ఇవ్వచ్చు. లేదంటే హైదరాబాద్ వాట్సప్ 9490616555, హైదరాబాద్ పోలీస్ ఫేస్‌బుక్, హాక్ ఐ మొబైల్ యాప్, డయల్ 100కు సమాచారం ఇవ్వవచ్చు.కల్తీని నిర్దారించగలిగితే నష్టపరిహారం కూడా పొందవచ్చు.

Related News
%d bloggers like this: