logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?

మ‌నం పేరు, వృత్తి, సంస్థ పేరు, మొబైల్ నెంబ‌ర్‌, చిరునామాతో కూడిన విజిటింగ్ కార్డు ఎవ‌రికైనా ఇస్తే మ‌న గురించి బేసిక్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ అంతా వారికి చెప్పిన‌ట్లే. ఒక్క చిన్న విజిటింగ్ కార్డు ద్వారా మ‌న గురించి మ‌నం చెప్పుకొవ‌చ్చు. అయితే, ఈ డిజిట‌ల్ జ‌మానాలో విజిటింగ్ కార్డులకు ప్రాధాన్య‌త త‌గ్గిపోతోంది. ఎవ‌రికీ విజిటింగ్ కార్డులు ఇవ్వాల్సిన అవ‌స‌రం ప‌డ‌టం లేదు. అంతా డిజిట‌ల్ మ‌యం అయిపోయింది. ఎవ‌రికైనా ఏదైనా కావాలి అంటే గూగుల్‌లో సెర్చ్ చేసి చూసుకుంటారు.

దీంతో గూగుల్ సెర్చ్‌లో మ‌న వ్యాపారానికి సంబంధించిన వివ‌రాలు ఉండ‌టం ఇప్పుడు కీల‌క‌మైపోయింది. అందుకే గూగుల్ ఇప్పుడు మ‌న‌కు వ‌ర్చువ‌ల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది. దీనిని పీపుల్ కార్డుగా గూగుల్ చెబుతోంది. అచ్చం విజిటింగ్ కార్డులానే ఉండే డిజిట‌ల్ కార్డు ఇది. ఇందులోనూ మ‌న పేరు, చిరునామా, మొబైల్ నెంబ‌ర్‌, సంస్థ పేరు, వృత్తి, హోదా వంటి వివ‌రాల‌ను మ‌నం పొందుప‌ర‌చ‌వ‌చ్చు. ఇవి ఎవ‌రికి కావాలంటే వారికి పంపించుకోవ‌చ్చు.

కొంత‌కాలం క్రితం గూగుల్ ఈ పీపుల్ కార్డు స‌దుపాయాన్ని మ‌న దేశంలో ప్రారంభించింది. పీపుల్ కార్డు మ‌నం చేయించుకుంటే గూగుల్ సెర్చ్‌లోనూ మ‌న వివ‌రాలు సులువుగా వ‌స్తాయి. అయితే, అంద‌రికీ ఇది అవ‌స‌రం లేదు. ఏవైనా వ్యాపారాలు చేస్తున్న వారికి, గూగుల్‌లో త‌మ పేరు, వివ‌రాలు ఉంటే ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని, వ్యక్తిగ‌త ప్రైవ‌సీకి ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు అనుకునే వారే ఈ పీపుల్ కార్డు తీసుకుంటే మంచిది.

గూగుల్ పీపుల్ కార్డు పొందే విధానం
1. మ‌న మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి మ‌న జీమెయిల్‌తో లాగిన్ కావాలి.
2. యాడ్ మీ టూ సెర్చ్ అని టైప్ చేస్తే యాడ్ యువ‌ర్‌సెల్ఫ్ టూ గూగుల్ సెర్చ్ అని ఒక బాక్స్ వ‌స్తుంది.
3. కింద గెట్ స్టార్టెడ్ అనే బ‌ట‌న్ క్లిక్ చేయాలి.
4. కొత్త‌గా ఓపెన్ అయ్యే ఒక పేజ్‌తో మీ పూర్తి పేరు, ప్రాంతం, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం వంటి వివ‌రాలు పొందుప‌ర్చాలి.
5. మ‌న ఫోన్ నెంబ‌ర్‌, సోష‌ల్ మీడియా ప్రొఫెల్ అడ్ర‌స్‌లు, జీమెయిల్ అడ్ర‌స్ వంటి వివ‌రాలు కూడా ఇవ్వొచ్చు.
6. వివ‌రాలు అన్ని నింపాక ఒక‌సారి ప్రివ్యూ చూసుకోవాలి.
7. ప్రివ్యూలో అంతా బాగుంది అనుకున్నాక సేవ్ ఆప్ష‌న్ క్లిక్ చేస్తే మీ పీపుల్ కార్డు సిద్ధమ‌వుతుంది.
8. మొబైల్ నుంచి మాత్రం పీపుల్ కార్డ్ త‌యారు చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

Related News