logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

అతిగా ఆకలి వేస్తుందా? కారణాలు ఇవే! ఇలా చేస్తే ఆ సమస్యలన్నీ దూరం..

రోజులో ఎన్ని సార్లు తిన్నా ఆకలి తీరడం లేదా? భోజనం చేసిన కొన్ని నిమిషాలకే మళ్ళీ ఆకలి అనిపించడం, నీరసంగా ఉండటం లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీరు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి సమస్యలు రోజువారీ పనుల్లో తీవ్ర ఆటంకాలను కలిగించడమే కాకుండా అతిగా తినడం వలన బరువు పెరుగుతున్నామనే భావనను కలిగిస్తాయి. అది మనల్ని ఇంకా ఒత్తిడికి గురి చేస్తుంది.

ఇలా పదే పదే ఆకలిగా అనిపించడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అతిగా ఆకలి వేయడానికి మెదడుకు కొన్ని సంబంధాలు ఉన్నాయి. నిద్ర లేమి సమస్యతో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రాత్రి నిద్ర లేకపోవడంతో జీవ క్రియలో ఇబ్బందులు ఎదురవుతాయి. దాని వల్ల సమయం కానీ సమయంలో ఆకలి వేయడం. ఎంత తిన్నా మళ్ళీ ఆకలిగా ఉన్నట్టుగా అనిపించడం జరుగుతాయి. నిద్రలేమి లైంగిక పరమైన సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. అందుకే ప్రతి రోజు 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం.

డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి చక్కర స్థాయిలు పెరిగినా.. తగ్గినా వెంటనే ఆకలిగా అనిపిస్తుంది. వీరు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే సరిపోతుంది. చాలా మంది వివిధ కారణాలతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ ని అశ్రద్ధ చేస్తుంటారు. మధ్యాహ్న సమయానికి ఆకలి ఎక్కువవుతుంది. అప్పుడు ఎంత తిన్నా ఆకలి వేస్తూనే ఉంటుంది. అందుకే బ్రేక్ ఫాస్ట్ ను అశ్రద్ధ చేయవద్దు. ఒత్తిడికి కి గురైనపుడు కూడా కొన్ని హార్మోన్లు విడుదలయ్యి తినాలనే కోరికను పుట్టిస్తాయి. వీలైనంత ప్రశాంతంగా ఉంటూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

ఓసర్వేలో వెల్లడైన విషయాల ప్రకారం.. శరీరం డీ హైడ్రేషన్ కు గురైనప్పుడు కూడా ఇలా జరుగుతుంది. నీటిని తక్కువ తాగడం వలన జీర్ణాశయంలో జఠాగ్ని మొదలవుతుంది. దాని వల్ల కూడా పదే పదే ఆకలి వేస్తుంది. నీటిని ఎక్కువగా తీసుకోవడం తప్పనిసరి. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు తగిన మోతాదులో ఉండాలి. ఇవేవీ లేని ఆహరం ఎంత తీసుకున్నా శరీరానికి శక్తి లభించదు. మనం తీసుకునే ఆహరం పోషక విలువలతో కూడుకున్నదైతే శరీరం రోజుకి 0.8 గ్రాముల బరువు మాత్రమే పెరుగుతుంది.

బరువు పెరుగుతున్నామనే కారణంతో చాలా మంది సరిగా తినరు. దీంతో ఆకలి ఎక్కువగా వేస్తుంది. భోజనానికి ముందు చాకోలెట్లు, కూల్ డ్రింక్స్, కూల్ కేక్స్ వంటి బేకరీ ఐటమ్స్ తినడం వలన పొట్ట ఫుల్ గా అనిపించి భోజనం తక్కువగా చేస్తారు. అప్పుడు కూడా కొన్ని నిమిషాలకే ఆకలి వేస్తుంది. అతిగా ఆకలి సమస్యతో బాధపడేవారు వాల్ నట్స్, సాల్మన్ ఫిష్, కొవ్వు పదార్థాలతో కూడిన వాటిని ఎక్కువగా తినాలి. దీని వల్ల శరీరంలోని హార్మోన్లు తృప్తి చెంది మళ్ళీ తినాలనే కోరికను కలిగించవు. అన్నంతో సమానంగా కూరలను తీసుకోవాలి. లేదంటే అన్నానికి బదులుగా గోధుమలతో చేసిన చపాతీలు తినడం వలన బరువు నియంత్రణలో ఉండటంతో పాటుగా ఎక్కువగా ఆకలి వేయదు.

Related News