logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? మీ నంబర్ ను ఎవరెవరు వాడుతున్నారు? ఇలా తెలుసుకోండి

సాధారణంగా ఒక వ్యక్తి తన పేర మీదగా దాదాపు తొమ్మిది వరకు ఫోన్ నంబర్లను వాడవచ్చు.ఈ వెసులుబాటుతో చాలా మంది వివిధ అవసరాల కోసం చాలా సిమ్ కార్డులు వాడుతుంటారు. కానీ కొంతమంది అంతకన్నా ఎక్కువ నంబర్లను వినియోగిస్తున్నట్టుగా పోలీసుల దృష్టికి వెళ్ళింది. అయితే సైబర్ నేరాలు పెరుగుతున్న సమయంలో మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? వాటినిమనకు తెలియకుండా ఎవరైనా వాడుతున్నారా? అనే విషయాలపై ఓ కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం.

లేదంటే వీటిని అసాంఘిక కార్యక్రమాలకు వాడే ప్రమాదం ఉంది. మనం ఆన్ లైన్ లావాదేవీలు చేసే క్రమంలో మన నంబరు కు వచ్చే ఓటీపీ ఎంతో కీలకం. ఎవరైనా మనకు తెలియకుండా మన నంబర్ ను వాడితే మనం చిక్కులో ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయం పై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునేందుకు విజయవాడ టెలికం విభాగం వీలు కల్పించింది. ఈ సేవలు ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వాసులు వినియోగించుకోవచ్చు. త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారు. మీరు వాడని నంబర్లపై వెంటనే ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. అందుకోసం విజయవాడ టెలికాం విభాగం రూపొందించిన ‘టిఎఎఫ్ సీవోపీ డాట్ డిజి టెలికాం డాట్ జీవోవీ డాట్ ఇన్’ ‌(https://tafcop.dgtelecom.gov.in) అనే వెబ్‌సైట్ ను తెరవాలి.

ఇందులో మీరు ప్రస్తుత ప్రయోగిస్తున్న ఫోన్ నంబర్ ను ఎంటర్ చేసి ‘గెట్ ఓటీపీ’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మన పేరు మీద ఎన్ని నంబర్లు ఉపయోగంలో ఉన్నాయో లిస్టు వస్తుంది. ఆ పక్కనే ఇది నా నంబర్, నా నంబరే కానీ ప్రస్తుతం ఉపయోగించడం లేదు అనే రెండు ఆప్షన్ లను చూపుతుంది. మీవి కాని నంబర్లపై టెలికం డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేయవచ్చు. ఆ నంబర్లపై టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది.

Related News