logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

వాట్సాప్‌లో ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఇలా చెక్ చేసుకోండి

మ‌నం ఈఎంఐ ప‌ద్ధ‌తిలో ఒక ఫోన్ కానీ, ఇంట్లోకి ఏదైనా వ‌స్తువు తీసుకోవ‌డానికి షోరూంకి వెళ్తే ముందుగా మ‌న పాన్ కార్డు అడుగుతారు. మ‌న పాన్ నెంబ‌రు ద్వారా క్రెడిట్ స్కోర్ చెక్ చేసి మ‌న‌కు ఈఎంఐ ఆప్ష‌న్ ఉంటుందో లేదో చెబుతారు. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 పాయింట్ల న‌డుమ ఉంటుంది. మ‌న స్కోర్ ఎంత అనే దానిని బ‌ట్టి మ‌న‌కు లోన్లు వ‌స్తాయి. క్రెడిట్ స్కోర్ త‌క్కువ‌గా ఉంటే లోన్లు రావు. ఎక్కువ‌గా ఉంటే సులువుగా లోన్లు వ‌స్తాయి.

క్రెడిట్ స్కోర్‌ను వివిధ అంశాల ఆధారంగా లెక్క‌గ‌డ‌తారు. మ‌నం ఇంత‌కుముందు తీసుకున్న లోన్లు తిరిగి స‌రిగ్గా చెల్లించామా.. లేదా, ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి, క్రెడిట్ కార్డుల మొత్తం లిమిట్‌లో ఎంత శాతం వాడుకుంటున్నారు, ఎన్నేళ్లుగా లోన్లు తీసుకుంటున్నారు, ఎన్ని లోన్లు ఉన్నాయి, లోన్ల కోసం ఎన్ని ఎంక్వైరీలు చేశారు, వంటి వివ‌రాల ఆధారంగా మ‌న క్రెడిట్ స్కోర్ లెక్క‌గ‌డ‌తారు. నెల నెలా క్రెడిట్ స్కోర్ మారుతూ ఉంటుంది.

క్రెడిట్ స్కోర్‌ను సిబిల్ స్కోర్ అని ఎక్కువ‌గా అంటారు. కానీ, సిబిల్ స్కోర్ అంటే ట్రాన్స్‌యూనియ‌న్ అనే సంస్థ ఇచ్చే స్కోర్‌. సిబిల్‌ అంటే క్రెడిట్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని అర్థం. ట్రాన్స్‌యూనియ‌న్ సిబిల్ స్కోర్ ఇచ్చిన‌ట్లుగానే ఎక్స్‌పీరియ‌న్‌, సీఆర్ఐఎఫ్ అనే సంస్థ‌లు కూడా క్రెడిట్ స్కోర్ ఇస్తాయి. అయితే, ఎక్కువ సంస్థ‌లు లోన్లు ఇచ్చేట‌ప్పుడు సిబిల్ స్కోర్ చూస్తాయి కాబ‌ట్టి సిబిల్ స్కోర్ ముఖ్య‌మైన‌ది.

సిబిల్ స్కోర్ తెలుసుకోవ‌డం మ‌న‌కు కూడా సులువే. పైసా బ‌జార్‌, బ్యాంక్ బ‌జార్‌, వ‌న్ స్కోర్ వంటి యాప్‌ల ద్వారా నెల నెలా ఉచితంగా సిబిల్ స్కోర్ తెలుసుకోవ‌చ్చు. అయితే, విష్‌ఫిన్ అనే ఒక ఫిన్ టెక్ సంస్థ సిబిల్ స్కోర్‌ను తెలుసుకోవ‌డానికి మరింత సులువు చేసింది. వాట్సాప్ ద్వారా ఈ సంస్థ సిబిల్ స్కోర్ వెల్ల‌డిస్తుంది. ఇందుకు గానూ ట్రాన్స్‌యూనియ‌న్ సిబిల్ సంస్థ‌తో విష్‌ఫిన్ సంస్థ ఒప్పందం చేసుకుంది.

వాట్సాప్ ద్వారా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలి అనుకునేవారు.. 8287151151 అనే నెంబ‌రుకు మిస్ కాల్ ఇవ్వాలి. అప్పుడు వాట్సాప్‌కు విష్‌ఫిన్ సంస్థ నుంచి ఒక మెసేజ్ వ‌స్తుంది. ఇందులో మీ పూర్తి పేరు, మీ పాన్ నెంబ‌రు, మీ ఇంటి అడ్ర‌స్‌, మీ ఈమెయిల్ ఐడీ వంటి వివ‌రాల‌ను అడుగుతారు. వీటికి స‌మాధానాలు వాట్సాప్‌లోనే ఇస్తే స‌రిపోతుంది. మీ సిబిల్ స్కోర్ మీకు వాట్సాప్‌లోనే వ‌చ్చేస్తుంది.

Related News
%d bloggers like this: