logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఎలా పొందాలి?

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రకటనతో గత ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని వారి సంఖ్య దాదాపు ఆరు లక్షల వరకు ఉంటుందని అంచనా.. అయితే రేషన్ కార్డుతో దిగువ, మధ్యతరగతి వారికి ఉన్న ప్రయోజనాల గురించి తెలిసిందే. సబ్సిడీ ధరలకు రేషన్ పొందాలన్నా, ఆరోగ్య శ్రీ, వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలన్నా ఆధార్ తో పాటుగా రేషన్ కార్డు ఉండాల్సిందే. కొత్త రేషన్ కార్డుకు అవసరమైన డాక్యుమెంట్స్, దరఖాస్తు ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రామాల్లో ఏడాదికి 1.6 లక్షలు, పట్టణాల్లో ఏడాదికి రెండు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు కార్డు పొందేందుకు అర్హులు. ఏ ప్రక్రియను రెండు విధాలుగా చేసుకోవచ్చు. మీకు దగ్గరలోని మీ సేవ సెంటర్ కు వెళ్లి రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చిన స్లిప్ ను తీసుకెళ్లి తహసీల్ధారు ఆఫీసులో ఇస్తే సరిపోతుంది.

లేదంటే నేరుగా తెలంగాణ మీసేవ వెబ్ సైట్( tg.meeseva.gov.in/DeptPortal/Meeseva-Applications)లోకి వెళ్లి అప్లికేషన్ ఫార్మ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సైట్ లోకి వెళ్లి సప్లైస్ డిపార్టుమెంట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
అక్కడ ‘అప్లై న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డు’ అనే దానిపైనా క్లిక్ చేయాలి.
అప్లికేషన్ ఫారంను డోన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
ఫారం లో మీ పేరు, వయస్సు, తండ్రి పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, జిల్లా, ఫ్యామిలీ మెంబర్స్ నంబర్స్ లాంటి వివరాలతో నింపాలి. ఇక్కడ మీ సంతకం వేలి ముద్రల విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇవే మీకు జీవితాంతం కొనసాగుతాయి.

ఈ ఫార్మ్ కు ఒరిజినల్ రెసిడెన్షియల్ ప్రూఫ్, ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు ప్రూఫ్, దరఖాస్తుదారుడి పాస్‏పోర్ట్ సైజ్ ఫోటోను జత చేసి ఫీజును, దరఖాస్తు ఫారంను మీసేవలో సబ్‌మిట్ చేయాలి. మీసేవలో ఇచ్చే అక్నాలెడ్జ్ స్లిప్ ను జాగ్రత్తగా పెట్టుకోండి. రేషన్ కార్డు రాగానే మీ మొబలై నంబర్ కు మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ సేవకు వెళ్లి మీ రేషన్ కార్డును ప్రింట్ తీసుకోవాలి. ఈ ప్రక్రియకు కనీసం వారం రోజుల సమయం పడుతుంది.

Related News