logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |  

పాకిస్థాన్‌ వ‌ల్ల మ‌న పానీపూరీ రేట్లు పెరుగుతున్నాయి తెలుసా ?

ఎటువంటి బేధాలు లేకుండా ప్ర‌తీ ఒక్క‌రూ ఇష్ట‌ప‌డేది పానీ పూరీ. ఉత్త‌రాధిన పుట్టిన ఈ ప్ర‌త్యేక వంట‌కం మ‌న తెలుగునాట కూడా చాలా పాపుల‌ర్‌. ప్ర‌తీ గ‌ల్లీలో, ప్ర‌తీ గ్రామంలో పానీ పూరీ బండ్లు వెలిశాయంటే మ‌నం పానీ పూరీని ఎంత ఇష్టంగా తింటామో అర్థం చేసుకోవ‌చ్చు. పానీ పూరీపైన ఆధార‌ప‌డి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్ర‌తీరోజూ పానీ పూరీ బండి పెడితే కానీ జీవ‌నం సాగించ‌లేని ప‌రిస్థితి వీల్ల‌ది.

ఇప్పుడు లాక్‌డౌన్, క‌రోనా వైర‌స్ వ‌ల్ల పానీ పూరీ బండ్ల వాళ్లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల మూడు, నాలుగు నెల‌లు వీరు ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు పానీపూరీ బండ్లు పెడుతున్నారు కానీ క‌రోనా వైర‌స్ భ‌యంతో ప్ర‌జ‌లు ఇదివ‌ర‌క‌టిలాగా పానీ పూరీ తిన‌డం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్న పానీ పూరీ బండ్ల వాళ్ల‌కు ఇప్పుడు మ‌రో స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.

పానీ పూరీ అంత రుచిగా త‌యారుకావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం రాక్ సాల్ట్‌. తెలుగులో దీన్ని న‌ల్ల ఉప్పు ఉంటారు. పానీ పూరీలోని పానీలో ఈ న‌ల్ల ఉప్పునే వాడ‌తారు. రాళ్ల‌లా గ‌ట్టిగా ఉండే ఈ ఉప్పు గ‌డ్డ‌ల‌ను ప‌గ‌ల‌గొట్టి పానీలో వేస్తారు. ఇది పానీ పూరీకి ప్ర‌త్యేక టేస్ట్ తీసుకువ‌స్తుంది. అందుకే చాలా మంది మ‌ళ్లీ మ‌ళ్లీ భ‌య్యా పానీ.. భ‌య్యా పానీ అని అడుగుతుంటారు.

ఇక్క‌డ అస‌లు స‌మ‌స్య ఏంటంటే… రాక్ సాల్ట్ ధ‌ర కిలోకు గ‌తంలో రూ.20ల లోపే ఉండేది. ఇది పానీ పూరీ వాళ్ల‌కు పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఇప్పుడు మాత్రం ఈ రాక్ సాల్ట్ ధ‌ర విప‌రీతంగా పెరిగిపోయింది. గ‌తంలో రూ.15 నుంచి రూ.20 మ‌ధ్య ఉండే రాక్ సాల్ట్ కిలో ధ‌ర ఇప్పుడు ఏకంగా ప‌దింత‌లు పెరిగి రూ.150కి చేరింది. దీంతో పానీపూరీ బండ్ల వాళ్లు ఇబ్బంది ప‌డుతున్నారు.

రాక్ సాల్ట్ ధ‌ర ఇంత‌లా పెర‌గ‌డానికి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన కార‌ణం ఉంది. పాకిస్థాన్‌ దుష్ట‌బుద్ధికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి గానూ పాకిస్థాన్‌తో అన్ని వాణిజ్య సంబంధాల‌ను భార‌త్ తెంచేసుకుంది. అక్క‌డి నుంచి దిగుమ‌తులు లేవు. మ‌న దేశం నుంచి పాక్‌కు ఎగుమ‌తులు లేవు. ఈ ప్ర‌భావ‌మే ఇప్పుడు పానీ పూరీపై ప‌డింది. ఎందుకంటే పానీ పూరీలో వాడే రాక్ సాల్ట్ ఎక్కువ‌గా పాకిస్థాన్ నుంచే దిగుమ‌తి అవుతుంది. అందుకే రాక్ సాల్ట్‌ను లాహోరీ సాల్ట్ అని కూడా అంటారు.

నిజానికి దేశ విభ‌జ‌న జ‌రిగిన కొత్త‌లోనే భార‌త్‌కు ఎటువంటి స‌మ‌యంలోనూ రాక్ సాల్ట్ స‌ర‌ఫ‌రా జ‌ర‌పాల‌ని రెండు దేశాల మ‌ధ్య ఒక ఒప్పందం కూడా జ‌రిగింది. కానీ, ఇప్పుడు ఈ ఒప్పందం అమ‌లు కావ‌డం లేదు. ప్ర‌స్తుతం పాకిస్థాన్ నుంచి దిగుమ‌తులు లేక‌పోవ‌డంతో నేరుగా రాక్ సాల్ట్ భార‌త్‌కు రావ‌డం లేదు. గ‌ల్ఫ్ దేశాల నుంచి మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తోంది. దీంతో రాక్ సాల్ట్ ధ‌ర విప‌రీతంగా పెరిగిపోయి కిలో రూ.150కి చేరింది.

మ‌న ద‌గ్గ‌ర పానీ పూరీ మిన‌హా ఏ వంట‌కాల్లోనూ రాక్ సాల్ట్‌ను వడ‌రు. కానీ, ఉత్త‌రాధి వంట‌కాల్లో రాక్ సాల్ట్‌ను ఎక్కువ‌గానే వినియోగిస్తుంటారు. ఇప్పుడు వాటిపైన కూడా ఈ ధ‌ర‌ల ఎఫెక్ట్ ప‌డింది. ఇక‌, ఇప్ప‌టికే క‌ష్టాల్లో ఉన్న పానీ పూరీ బండ్లు వాళ్లు ఎలాగూ పెరిగిన రాక్ సాల్ట్ ధ‌ర‌ల‌కు త‌గ్గ‌ట్లుగా పానీ పూరీ ధ‌ర‌ను కూడా పెంచేస్తారు. చివ‌ర‌కు ఈ ఎఫెక్ట్ పానీ పూరీ ల‌వ‌ర్స్‌పైన ప‌డుతుంద‌న‌మాట‌.

Related News