logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |  

వ‌ర్షాన్ని ఎలా కొలుస్తారు ? మ‌ల్లీమీట‌ర్లు, సెంటీమీట‌ర్ల‌లోనే ఎందుకు కొలుస్తారు ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు విప‌రీతంగా ప‌డుతున్నాయి. క్యుములోనింబ‌స్ మేఘాల ప్ర‌భావంతో భారీ వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతోంది. వ‌ర్షాలు ఎప్పుడు ప‌డ్డా మ‌న‌కు ఫ‌లానా ప్రాంతంలో ఇన్ని మిల్లీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది, ఫ‌లానా ప్రాంతం అన్ని సెంటీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది అనే వార్త వినిపిస్తుంటాయి. ఎన్ని సెంటీమీట‌ర్ల వ‌ర్షం కురిసింద‌నే దానిని బ‌ట్టి అది భారీ వ‌ర్ష‌మా, అతి భారీ వర్ష‌మా అనేది తెలుసుకుంటారు. అయితే, ధ్ర‌వ‌ప‌దార్థ‌మైన వ‌ర్షాన్ని మిల్లీ లీటర్లు, సెంటీమీట‌ర్ల లెక్క‌న ఎలా కొలుస్తార‌నే అనుమానం చాలా మందిలో ఉంటుంది.

మ‌న‌లో చాలామందికి వ‌ర్షం మిల్లీమీట‌ర్లు, సెంటీమీట‌ర్ల‌లో కొలుస్తార‌ని తెలుసు కానీ ఎలా కొలుస్తార‌నే విష‌యం తెలియ‌దు. వ‌ర్షాన్ని కొలిచేందుకు అంత‌ర్జాతీయంగా ఒక‌టే విధానం ఉంటుంది. ఇది చాలా సులువైన ప‌ద్ధ‌తి కూడా. రెయిన్ గెజ్ అనే ఓ చిన్న ప‌రిక‌రం ద్వారా వ‌ర్షాన్ని కొలుస్తుంటారు. రెయిన్ గేజ్‌ను తెలుగులో వ‌ర్ష‌మాప‌కం అని పిలుస్తారు. ఇది ఫైబ‌ర్ గ్లాస్‌తో త‌యారు చేసిన ఒక చిన్న ఖాళీ సీసా లాంటిది.

దీనికి పైనా 10 సెంటీమట‌ర్ల వ్యాసంతో ఒక ఫ‌న్న‌ల్ ఉంటుంది. ఇది ఒక లీట‌రు సామ‌ర్థ్యం క‌లిగిన మెజ‌రింగ్ జార్‌పైన ఫిక్స్ చేసి పెడ‌తారు. మెజ‌రింగ్ జార్ అంటే సీసా లాంటిది. మెజ‌రింగ్ జార్‌కు స్కేల్‌కు ఉన్న‌ట్లుగా మిల్లీమీటర్ల లెక్క‌న కొల‌త‌లు ముద్రించి ఉంటాయి. ఈ రెయిన్ గేజ్‌ను వాతావ‌ర‌ణ శాఖ‌, ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో పెడుతుంది. పైక‌ప్పు లేకుండా ఉండే ఆరుబ‌య‌ట లేదా మిద్దె పైన లేదా ఖాళీ స్థ‌లంలో ఈ రెయిన్ గేజ్‌ల‌ను పెట్టి ఉంచుతారు.

అక్క‌డ ప‌డే వ‌ర్షపు నీరు రెయిన్ గేజ్ పైన ఉండే గొట్టం లాంటి ఫ‌న్న‌ల్ ద్వారా మెజ‌రింగ్ జార్‌లోకి వెళుతుంది. మెజ‌రింగ్ జార్‌లోకి చేరిన వ‌ర్ష‌పు నీరు ఎన్ని మిల్లీమీట‌ర్లు ఉందో జార్‌పైన ముద్రించి ఉండే కొల‌త‌ల ద్వారా ప‌రిశీలిస్తారు. మెజ‌రింగ్ జార్‌లో వ‌ర్ష‌పు నీరు ఎన్ని మిల్లీ మీట‌ర్లు ఉంటే ఆ ప్రాంతంలో అంత వ‌ర్షం కురిసిన‌ట్లు లెక్క‌.

గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌తీ మండ‌లంలో ఒక రెయిన్ గేజ్‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంది. ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రాంతాల్లో ప్ర‌భుత్వ క‌మ్యూనిటీ హాళ్లు, స్కూళ్ల‌లో ప్ర‌భుత్వం రెయిన్ గేజ్‌లు పెట్టి ఉంచుతుంది. వీటిని అధికారులు వ‌ర్షం ప‌డ్డ‌ప్పుడ‌ల్లా ప‌రిశీలించి అక్క‌డ న‌మోదైన వ‌ర్ష‌పాతం లెక్క‌ల‌ను వెల్ల‌డిస్తారు. ప్ర‌భుత్వానికి కూడా ఎంత త‌మ ప్రాంతంలో ఎంత వ‌ర్ష‌పాతం న‌మోదైందో నివేదిక ఇస్తారు. దీని ద్వారానే ప్ర‌భుత్వం ఎక్కువ వ‌ర్షాలు కురిసిన‌ప్పుడు ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తుంది. స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

Related News