logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

ఓ కొత్త మేకు మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాది జాడ చెప్పింది

క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల‌కు భారీ ఎదురుదెబ్బ తగ‌లింది. హిజ్బుల్ ముజాహిద్దిన్ అనే సంస్థ‌కు చెందిన ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను రెండు రోజుల క్రితం పోలీసులు, సైన్యం మ‌ట్టుబెట్టింది. మ‌ర‌ణించిన ఉగ్ర‌వాదుల్లో ఒక‌డు మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్‌, హిజ్బుల్ ముజాహిద్దిన్ క‌మాండర్ రియాజ్ అహ్మ‌ద్ నాయికూ కూడా ఉన్నాడు. చాలా రోజులుగా అత‌డు క‌శ్మీర్ యువ‌త‌ను ఉగ్రవాదం వైపు మ‌ళ్లిస్తున్నాడు. ఉగ్ర‌దాడులకు వ్యూహాలు ప‌న్న‌డంలో నాయికూది మాస్ట‌ర్‌మైండ్‌.

నాయికూని మ‌ట్టుబెట్ట‌డానికి పోలీసులు చాలా రోజులుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. కొంద‌రు ఉగ్ర‌వాద మూలాలున్న వారిని గుర్తించి వారి ఫోన్‌ల‌ను ట్రాప్ చేస్తున్నారు. సాధార‌ణంగా నాయికూ ఫోన్ మాట్లాడ‌డు. కానీ, ఇటీవ‌ల ఓ ఉగ్ర‌వాదికి ఫోన్ చేసిన విష‌యాన్ని పోలీసులు ప‌సిగట్టారు. ఫోన్ ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో అడ్ర‌స్ గుర్తించారు. మే 5వ తేదీన పోలీసులు, ప్ర‌త్యేక బ‌ల‌గాలు నాయికూ నుంచి ఫోన్ వెళ్లిన అడ్ర‌స్‌కు వెళ్లారు. అయితే, రెండు ఇళ్ల‌ను వెతికినా అత‌డి జాడ దొర‌క‌లేదు.

ఎందుకైనా మంచిద‌ని మూడో ఇంటికి పోలీసులు వెళ్లారు. అక్క‌డ కూడా ఎవ‌రూ లేరు. అయితే, ఆ ఇంట్లో గాలిస్తున్న ఓ పోలీసు అధికారికి ఇంటి పైక‌ప్పుకు ఉన్న ఫాల్స్ సీలింగ్‌కు ఒక కొత్త మేకు క‌నిపించింది. దీంతో అనుమానం వ‌చ్చిన పోలీసులు ఆ ఫాల్స్ సీలింగ్‌ను కొట్ట‌గా లోప‌లి నుంచి కాల్పులు మొద‌ల‌య్యాయి. ఫాల్స్ సీలింగ్ లోప‌ల ఉన్న అట‌క‌పై దాగిన ఉగ్ర‌వాదులు కాల్పులు ప్రారంభించ‌డంతో పోలీసులు వారిని మ‌ట్టుబెట్టారు. నాయికూతో పాటు మ‌రో ఉగ్ర‌వాది అక్క‌డే హ‌త‌మ‌య్యారు.

Related News
%d bloggers like this: