logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

తుఫాన్లకు పేర్లు ఎలా పెడ‌తారు ? అంఫాన్ తుఫాను పేరు ఎలా వ‌చ్చింది ?

ఫ‌లానా తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. ఫ‌లానా పేరు గ‌ల‌ తుఫాన్ విశాఖ‌ప‌ట్నం – భువ‌నేశ్వ‌ర్ మ‌ధ్య తీరం దాట‌బోతోంది. తీరం దాటే స‌మ‌యంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయి. తుఫాన్ ప్ర‌భావిత‌ తీర ప్రాంతాల్లో ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇటువంటి వార్త‌లు మ‌న‌ము త‌ర‌చూ తుఫాన్లు సంభ‌వించిన‌ప్పుడు వింటూ ఉంటాం. అయితే, ప్ర‌తిసారి కొత్తగా వ‌చ్చే తుఫానుకు ఒక పేరుతో పిలుస్తుంటారు. లైలా, హుద్ హూద్‌, తిత్లీ, ఫ‌ణి ఇలా ర‌క‌ర‌కాల పేర్ల‌ను తుఫాన్లకు పెడుతుంటారు. ఇప్పుడు తాజాగా అంఫాన్ తుఫాన్ మొద‌లైంది. ఇలా తుఫాన్లు వచ్చిన‌ప్పుడ‌ల్లా, వాటి పేర్లు విన్న‌ప్పుడ‌ల్లా ఈ తుఫాన్ల‌కు పేర్లు ఎలా వ‌చ్చాయి అనే ఒక అనుమానం అంద‌రిలో మొద‌ల‌వుతుంది.

ఈ పేర్ల వెనుక ఆస‌క్తిక‌ర క‌థ ఉంది. అట్లాంటిక్ స‌ముద్రంలో వచ్చే తుఫాన్ల‌కు 1953 నుంచే పేర్లు పెడుతున్నారు. ప‌లు దేశాల్లో త‌ర‌చూ సంభ‌వించే హ‌రీకేన్ల‌కు కూడా పేర్లు పెట్టే సంప్ర‌దాయం ఉంది. తుఫాన్ల‌కు ఒక పేరు పెట్ట‌డం ద్వారా ఆ తుఫాను ప‌ట్ల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డం సులువ‌వుతుంది. ఒక్కో సంవ‌త్స‌రం రెండు తుఫాన్లు కూడా వ‌స్తుంటాయి. కాబ‌ట్టి పేర్లు పెట్ట‌డం ద్వారా తుఫాను గురించి చెప్ప‌డానికి, వివ‌రాలు న‌మోదు చేయ‌డానికి, వార్త‌లు ప్ర‌జ‌ల్లోకి చేర్చ‌డానికి గంద‌ర‌గోళం లేకుండా ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో ఐక్య రాజ్య స‌మితి అనుబంధ ప్ర‌పంచ వాతావ‌ర‌ణ సంస్థ సూచ‌న‌ల మేర‌కు ద‌క్షిణాసియా దేశాల్లోనూ 2004 నుంచి తుఫాన్ల‌కు పేర్లు పెట్ట‌డం మొద‌ల‌య్యింది. హిందూ మ‌హాస‌ముద్రం, బంగాళాఖాతం, అరేబియా స‌ముద్ర తీర ప్రాంతాల్లోని భార‌త్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్‌, థాయ్‌ల్యాండ్‌, శ్రీలంక‌, మాల్దీవులు, ఓమ‌న్ దేశాలు ఇందుకోసం 2004లో ఒక ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించి ఇక నుంచి సంభ‌వించే తుఫాన్ల‌కు పేర్లు పెట్టాల‌నే అంగీకారానికి వ‌చ్చాయి. అంటే, అంత‌కుముందు మ‌న ద‌గ్గ‌ర సంభ‌వించిన తుఫాన్లకు ఎటువంటి పేర్లూ ఉండేవి కాదు.

తుఫాన్ల‌కు పెట్టేందుకు ఈ ఎనిమిది దేశాలు ఎనిమిది చొప్పున పేర్ల‌ను పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. ఇలా ఒక్కోసారి ఒక్కో దేశం సూచించిన పేరును తుఫాన్ల‌కు పెడుతూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం సంభ‌విస్తున్న అంఫాన్ తుఫాను పేరును థాయ్‌ల్యాండ్ సూచించింది. ఫ‌ణి తుఫాను పేరున బంగ్లాదేశ్‌, హుద్‌హూద్, తిత్లీ తుఫాన్ల పేర్ల‌ను పాకిస్తాన్ సూచించింది. ఇలా ఎనిమిది దేశాలు సూచించిన 64 పేర్ల‌లో ఇప్ప‌టికే 58 పేర్లు వాడేశారు. ఈ పేర్లు అన్నీ అయిపోయాక మ‌ళ్లీ అన్ని దేశాలు పేర్ల‌ను సూచించే అవ‌కాశం ఉంది.

భార‌త్ అగ్ని, ఆకాశ్‌, బిజిలీ, జ‌ల్‌, లెహ‌ర్‌, మేఘ్‌, సాగ‌ర్‌, వాయి అనే పేర్ల‌ను తుఫాన్లకు పెట్ట‌డానికి సూచించింది. ఇలా ఆయా దేశాలు వాటి భాష‌ల్లో పేర్ల‌ను సూచిస్తాయి. అందుకే కొన్ని తుఫాన్ల పేర్లు విన‌డానికి కొత్త‌గా, ప‌ల‌క‌డానికి ఇబ్బందిగా ఉంటాయి. తుఫాన్ల‌కు పేర్లు పెట్ట‌డం ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డానికి, తుఫాన్లు గురించి వివ‌రాల‌ను న‌మోదు చేయ‌డానికి ఉప‌యోడ‌ప‌డుతుంది.

Related News