logo

  BREAKING NEWS

జ‌గ‌న్ షాకింగ్ నిర్ణ‌యం.. ఇద్ద‌రు తెలంగాణ వాళ్ల‌కు రాజ్య‌స‌భ సీటు  |   ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |  

అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే ఎయిర్ బ్యాగులు ఎలా పనిచేస్తాయో తెలుసా?

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వాహన ప్రమాదాల్లో ప్రాణనష్టం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం మ‌న‌కు అందుబాటులో ఉన్న కార్ల‌లో అనేక రకాల సేఫ్టీ ఫీచ‌ర్లు లభిస్తుండటమే అందుకు కారణం. సీట్ బెల్టులు, ఎయిర్ బ్యాగులు, కార్ల‌కు ముందు బంప‌ర్లు.. ఇలా ప్రతీది మనల్ని అత్యవసర సమయాల్లో కాపాడేదే. వాహన ప్రమాదాలను అరికట్టడానికి వాహనదారులు సీటు బెల్టు ధరించడం, ఆ వాహనంలో ఎయిర్ బ్యాగులు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

అయితే సీటు బెల్టుల విషయం అటుంచితే ఎయిర్ బ్యాగుల వెనుక ఉన్న టెక్నలజి చాలా ఆసక్తికరమైనది. మనం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన వెంటనే ఇవి తెరుచుకుని ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయి. తలకు, ఛాతి ఎముకలకు రక్షణగా గాలితో నింపబడిన బెలూన్ లాగా ఇది పని చేస్తుంది. ప్రాణ నష్టం జరగకుండా చేస్తాయి. అందుకే టూ వీలర్ మీద వెళ్లే వారికి హెల్మెట్ ఎంత అవసరమో కార్లలో ఎయిర్ బ్యాగులు ఉండటం కూడా అంతే అవసరం.

ఆక్సిడెంట్లు జరిగినప్పుడు ఎయిర్ బ్యాగుల్లో ఉండే ప్రత్యేక మైన సెన్సార్లు అప్రమత్తమవుతాయి. ఎయిర్ బ్యాగు వ్యవస్థలో ఎయిర్ బ్యాగుతో పాటుగా యాక్సెలరోమీటర్, ఒక సర్క్యూట్, హీటింగ్ ఎలిమెంట్ ఉంటాయి వీటితో పాటుగా చాలా తక్కువ మోతాదులో పేలుడు పదార్థం ఉంటుంది. మీ వాహనం ఎంత వేగంగా వెళ్తుంది అనే విషయాన్ని ఎయిర్ బ్యాగులో ఉండే యాక్సెలరోమీటర్ గమనిస్తూ ఉటుంది. మీ వాహనం నిర్దిష్ట వేగం దాటినా లేక ఎదురుగా వస్తున్న ఏదైనా వాహనాన్ని, వస్తువును ఢీ కొట్టినా ఈ పరికరం అందులో ఉండే సర్క్యూట్ ను ఆన్ చేస్తుంది.

ఆ హీలింగ్ ఎలిమెంట్ ద్వారా కరెంట్ ప్రసారమవుతుంది. ఇది మనం ఇళ్లలో వేడి నీటి కోసం ఉపయోగించే హీటర్ కూడా ఇలాంటిదే. కాకపోతే ఇది చాలా వేగంగా వేడెక్కుతుంది. ఆ వేడికి పేలుడు పదార్థం పేలిపోయి నైట్రోజన్ గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్యాస్ కారణంగా ఎయిర్ బ్యాగ్ నైట్రోజన్ గ్యాస్ తో నిండిపోతుంది. కానీ ఎక్కువ సేపు ఎయిర్ బ్యాగు తెరుచుకుని ఉంటె వాహనం నడిపేవారు ప్రమాదంలో పడే అవకాశం ఉంతుంది. కారులో నుంచి వేగంగా బయటకు వచ్చేందుకు వీలుగా ఈ ఎయిర్ బ్యాగు తెరుచుకున్న కొన్ని సెకండ్లకే తిరిగి ముడుచుకుపోతుంది.

ఎయిర్ బ్యాగులకు ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా నైట్రోజన్ గ్యాస్ నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతుంది. ఈ రెండు చర్యల కారణంగా వాహన ప్రమాదాలు సంభవించినప్పుడు శరీరం పై ఒత్తిడి పడకుండా చేయడం ద్వారా ఛాతి ధ్వంసం కాకుండా చేస్తుంది. ఈ విధంగా గాయాల తీవ్రతను తగ్గించడంలో ఎయిర్ బ్యాగులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ మొత్తం ప్రాసెస్ జరగటానికి పెట్టె సమయం కేవలం సెకనులో నాలుగో వంతు మాత్రమే.

Related News