logo

  BREAKING NEWS

పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |  

ఉదయాన్నే వేడి నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!

మనం తిన్న ఆహారంలో కొన్ని పదార్థాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కొన్ని సార్లు ఆ పదార్థాలు పేగుల్లో అలాగే మిగిలిపోయి విషపూరితంగా తయారవుతాయి. అందుకే చాలా మందిలో వాతం ఏర్పడి ఒంటి నొప్పులు, కీళ్లనొప్పులు తదితర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీటన్నిటికి ఒకే ఒక్క చిట్కాతో దూరం చేసుకోవచ్చు. ఉదయం నిద్రలేవగానే.. కాలకృత్యాలు తీర్చుకోడానికి ముందే రెండు లేదా మూడు గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగండి. కానీ బాగా మరిగించిన నీటిని అలాగే తాగడం వలన కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయి. మొత్తం ఒకేసారి కాకుండా నెమ్మదిగా తాగాలి. మరి, రోజూ వేడి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో చూసేద్దాం…

డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగడం ఎంతో మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. వేడి నీరు తాగడం వల్ల పెద్ద పేగు శుభ్రపడుతుంది. రోజంతా చురుకుగా ఉండగలుగుతారు. శరీరంలో హానికర మలినాలు, చెడు పదార్ధాలు తొలగిపోయి రక్త శుద్ధి జరుగుతుంది. ఫలితంగా కొత్త రక్తం తయారవుతుంది. రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. కడుపు నొప్పి, అజీర్తి తదితర జీర్ణ సమస్యలు, ఇతరత్ర ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది మంచి ఔషదం. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా కాపాడేది వేడి నీళ్లే. అరా లీటర్లు నుంచి లీటరు నీటిని తాగగలిగితే గనుక శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలను సైతం వేడి నీళ్లతో అధిగమించవచ్చు.

ఒక గ్లాసు వేడినీళ్లు ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. తద్వారా బరువు తగ్గుతారు. వేడి నీరు గొంతు సమస్యలను దరి చేరనివ్వకుండా కాపాడుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు ఉదయం పరగడుపున వేడినీటిని త్రాగితే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. ఒక గ్లాస్ వేడినీటిని త్రాగటం వలన శరీరంలోని విషపూరిత టాక్సిన్స్ తొలగిపోతాయి. అంతేకాక పొట్టలోని ఆహారం, లిక్విడ్స్ ని డీకంపోజ్ చేసి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. గ్యాస్ అసిడిటీ సమస్యలు క్రమంగా దూరమవుతాయి. జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచుతుంది. దగ్గు, పడిశంతో బాధపడుతున్నవారికి కూడా వేడి నీరు మంచి మందు.

వేసవి కాలంలో సైతం డిహైడ్రేడ్ సమస్య తీర్చేందుకు వేడి నీరు ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ముప్పు ఉందని భయపడేవారికి వేడి నీరు మంచి ఔషదం. ఈ కరోనా సీజన్లో వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మరింత మంచిది. వైరస్‌లు ప్రమాదకర బ్యాక్టరీయాలను తరిమే శక్తి వేడి నీళ్లకు ఉంటుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శ్వాసనాళాలను శుభ్రం చేసి.. శ్వాస తేలికగా ఆడటానికి సహాయపడుతుంది. వేడి ఈరు తగిన గంట వరకు కాఫీ, టీలు, ఎలాంటి అల్పాహారం తీసుకోకుండా చూసుకోవాలి. గోరువెచ్చని నీటికి తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఇంకా మంచిది. రోజూ ఇలా చేస్తే.. తప్పకుండా మంచి ఫలితాలను చూస్తారు.

Related News