logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

హానర్ నుంచి తొలి ల్యాప్ టాప్.. భారీ తగ్గింపు ఆఫర్

కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. అదే విధంగా ల్యాప్ టాప్ ల వినియోగం కూడా పెరగడంతో వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో హానర్ సంస్థ తన తొలి ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరిలో దీనిని లాంచ్ చేయగా భారత్ లో శుక్రవారం రోజున హానర్‌ మ్యాజిక్‌ బుక్‌ 15ను లాంచ్ చేసింది.

మిస్టిక్ గ్రీన్ కలర్ లో లభిస్తున్న ఈ ల్యాప్ టాప్ ధర 42,990 రూపాయలు గా నిర్ణయించారు. అయితే దీనిపై ప్రారంభ ఆఫర్ ను కూడా ప్రకటించారు. 3000 తగ్గింపు ధరతో రూ. 39,990లకు ఈ ల్యాప్ టాప్ ను సొంతం చేసుకోవచ్చు. ముందుగానే దీనిలో విండోస్ 10 ను ఇన్ స్టాల్ చేసి ఇస్తారు. 15.6-అంగుళాల హెచ్ డీ డిస్ప్లే లభిస్తుంది.

8 జీబీ ర్యామ్‌ 256జీబీ స్టోరేజ్‌ కెపాసిటీ కలిగి ఉంది. 1920×1080 పిక్సెల్స్ 87 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, యూటీవీ రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ అదనం. టైప్-సీ పోర్ట్, 65 వాట్స్ ఛార్జర్ ద్వారా కేవలం అరగంటఓ 50 శతం ఛార్జింగ్ చేస్తుంది. ఒక సారి ఛార్జ్ చేస్తే 6. 3 గంటలపాటు బ్యాటరీని వినియోగించవచ్చు. టూ ఇన్ వన్ ఫింగర్ ప్రింట్, పాప్ అప్ వెబ్ క్యామ్ ఫీచర్లను కూడా పొందవచ్చు.

Related News