logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

అబార్షన్ కు ఒప్పుకోలేదని.. గద్వాల జిల్లాలో పరువు హత్య!

అబార్షన్ కు ఒప్పుకోలేదన్న కారణంతో కన్న తల్లితండ్రులే ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసారు. జోగులాంబ గద్వాల జిల్లా కలుకుంట్ల గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఈ పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శాంతినగర సీఐ వెంఎంకటేశ్వర్లు కథనం ప్రకారం.. కలుకుంట్ల గ్రామానికి చెందిన భాస్కరయ్యకు ముగ్గురు కుమార్తెలు. మూడో కుమార్తె దివ్య(18) కర్నాలు లోని సెయింట్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది.

కోడుమూరు ప్రాంతానికి చెందిన యుకుడితో ప్రేమలో పడింది. ఇటీవల దివ్య అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా దివ్య 13 వారాల గర్భవతి అని తెలిసింది. ఆమెను వెంటనే అబార్షన్ చేయించుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. అందుకు దివ్య ఒప్పుకోకపోగా ప్రేమించిన యువకుడితో తనకు వివాహం జరిపించాలని కోరింది. దీంతో కూతురిపై పగ పెంచుకున్న తల్లిదండ్రులు ఆమె హత్యకు పథకం వేశారు.

శనివారం అందరూ ఆరు బయట పడుకున్నారు. అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న దివ్యను దిండుతో ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశారు. అనంతరం కూతురిది సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసారు. గ్రామ కార్యదర్శి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు దివ్యను తల్లితండ్రులు హతమార్చినట్టుగా తేల్చారు.

Related News