logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

స్టైలిష్ డిజైన్ తో ఆకట్టుకుంటున్న హొండా గ్రేజియా 125.. ధర ఎంతంటే?

ప్రముఖ వాహన తయారీదారు సంస్థ హొండా మార్కెట్లోకి ఏ స్కూటర్ ను తీసుకువచ్చిన యూత్ ను దృష్టిలో పెట్టుకుని స్టైలిష్ గా రూపొందిస్తుంది. తాజాగా ఈ సంస్థ నుంచి మరో కొత్త స్కూటర్ లాంచ్ అయ్యింది. అదే బీఎస్6 గ్రేజియా 125. లాక్ డౌన్ కారణంగా విడుదలను వాయిదా వేసుకున్న హొండా ఇప్పుడు తమ సరికొత్త వాహనాన్ని భారత మార్కెట్లోకి తెచ్చింది. బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఈ వాహనాన్ని తెచ్చింది.

హొండా గ్రేజియా ధర విషయానికొస్తే .. ఎక్స్ షోరూంలో ఈ స్కూటర్ ధర రూ.73,336లుగా సంస్థ నిర్ణయించింది. స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో ఈ వాహనం లభ్యమవుతున్న కారణంగా భిన్నమైన ధరలలో దీనిని ప్రవేశపెట్టారు. ఈ వాహనం డిజైన్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది. ఎల్ ఈడీ హెడ్ ల్యాణపులు, సరికొత్త ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఈసీజీ స్టారర్ మోటార్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టం, ఎల్ ఈడీ టైల్ లైట్స్, 3డీ లోగో, సేడ్ పానెల్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ తో ఈ వాహనాన్ని డిజైన్ చేసారు.

అంతేకాదు పాస్ స్విచ్, ఇంజిన్ స్టార్ట్ లేదా స్టాప్ స్విచ్, మల్టీ ఫంక్షనల్ స్విచ్, ఫ్యూయల్ లిడ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి 124సీసీ, ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో అందుబాటులోకి వచ్చింది. వీ-టైప్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో ఇది పనిచేస్తుంది.

మ్యాటీ సైబర్ యెల్లో, సైరెన్ బ్లూ, మ్యాటీ యాక్సిస్ గ్రే, పెరల్ స్పార్టాన్ రెడ్ లాంటి రంగుల్లో ఇది లభ్యమవుతుంది. ఇప్పటికే ఈ వాహనం బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హొండా డీలర్స్ షోరూం లలో ఈ వాహనం అందుబాటులో ఉంది.

Related News