logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

జలుబు, దగ్గును తగ్గించడానికి సైన్స్ చెబుతున్న ఇంటి చిట్కాలు ఇవే..

శరీరం ఏదైనా అనారోగ్యం బారిన పడుతుందని ముందే హెచ్చరించే లక్షణాలు జలుబు, దగ్గు. కొన్ని సార్లు ఇవి వాతావరణ మార్పుల వల్ల రావచ్చు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకసారి జలుబు కచ్చితంగా వచ్చే ఉంటుంది. దాదాపు 200 వైరస్ ల వలన మనకు జలుబు చేసే అవకాశం ఉంటుందట. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు.

సాధారణ జలుబే అయితే మూడు నుంచి నాలుగు రోజులలో తగ్గిపోతుంది. లేక ఇతర అనారోగ్య సమస్యల కారణంగా వస్తే జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, నీరసం, వామ్టింగ్స్ ఇలా రకరకాల లక్షణాలను చూపుతూ తీవ్రమవుతుంది. అందుకే ఈ సమస్యకు ప్రారంభంలోనే చెక్ పెట్టాలి. జలుబు తగ్గించే వంటింటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని నిజంగానే జలుబుకు కారణమయ్యే వైరస్ ల నుంచి శరీరాన్ని రక్షణ ఇస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు అవేంటో చూద్దాం…

చలికాలంలో వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. జలుబు, దగ్గు వంటివి ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని అధికంగా వేధిస్తాయి. వాతావరణం బాగాలేని సమయంలో మన ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు కూడా జలుబు, జ్వరాన్ని కల్గిస్తాయి. జలుబుకు కారణాలు అనేకం ఉంటాయి. బయటి ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా మనం తీసుకునే ఆహారం ఉండాలి. ఉదాహరణకు ఈ చలికాలంలో కూల్ డ్రింక్స్, మసాలా ఫుడ్స్ వంటి పదార్థాలు తీసుకుంటే అది మన శరీరంలో వేడిని అధికంగా పెంచి అనారోగ్యానికి దారి తీస్తుంది.

ఇలాంటి సమయాల్లో చాలా మంది ఇంటి చిట్కాల మీదే ఆధారపడతారు. చికెన్ సూప్ తాగడం, వెల్లుల్లి తినడం, సి విటమిన్ కలిగిన పండ్ల వల్ల జలుబు తగ్గుతుందని వింటుంటాం. అయితే వీటిలో కొన్ని చిట్కాలు నిజంగానే జలుబు, దగ్గు, జ్వరాన్ని అదుపు చేయగలవని కొన్ని అధ్యయనాలలో తేలింది. ఈసారి జలుబు చేస్తే ఓసారి ఇలా చేసి చూడండి..

1) 8 నల్ల మిరియాలను పొడి చేసి ఒక స్పూన్ తేనెతో కలిపి రాత్రి పడుకునే ముందు, ఉదయం లేవగానే మరోసారి తీసుకోవడం వలన దగ్గు తగ్గిపోతుంది. జలుబు ఉన్నప్పుడు పాలు తాగడం మంచిదంటారు కానీ కొందరిలో అది శ్వాసకు సంబందించిన మరి కొన్ని లక్షణాలకు కారణమవుతుందని తేలింది.

2) వెల్లుల్లిలో ఎల్లిసిన్ ఉంటుంది. వెల్లుల్లి జలుబు తగ్గడానికి సాయం చేసే సమర్థమైన ఇంటి మందుగా తేలింది. ముఖ్యంగా చలి కాలంలో రోజు ఉదయాన్నే 2 వెల్లులి రెబ్బలను నమిలి తినడం వలన జలుబు దరిచేరకుండా చేస్తుంది. దీంతోపాటుగా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

3) వంటగదిలో ఉండే వస్తువులతో తయారు చేసుకునే కాషాయం జలుబు, దగ్గును తక్షణమే తగ్గించే మరొక అద్భుతమైన చిట్కా. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల మిరియాలు., శొంఠిని పొడి చేసి రెండు కప్పుల నీటిలో మరిగించి రోజుకి రెండు సార్లు తాగడం వలన కూడా ఈ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు.

4) చికెన్ సూప్ తాగడం వలన అంతగా ప్రయోజనం లేకపోయినా ఇలా చేస్తే జలుబు తగ్గుతుందని నమ్మేవారికి ఈ చిట్కా నిజంగానే పని చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. అలాగే జలుబు ఉన్నప్పుడు జింక్ బిళ్లలను నమలడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.

 

Related News