logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

జుట్టు రాల‌డం త‌గ్గాలంటే ఈ చిన్న‌ చిట్కాలు పాటించండి చాలు

చాలామందికి జుట్టు రాల‌డం అనేది ఈ రోజుల్లో పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది. జుట్టు ఊడిపోతున్న‌ద‌ని ఆలోచించ‌డం ఒక మాన‌సిక స‌మ‌స్య‌గా కూడా మారింది. కొంద‌రు యువ‌తీ, యువ‌కులైతే జుట్టు ఊడిపోతోంద‌నే బాధ‌తో ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసుకుంటున్న సంఘ‌ట‌న‌లు మనం వార్త‌ల్లో చూస్తున్నాం. గ‌తంలో జుట్టు ఊడ‌టం అనేది పెద్ద వ‌య‌స్సు వారికి ఉండే స‌మ‌స్య‌. కానీ, ఇప్పుడు ఎక్కువ‌గా యుక్త వ‌య‌స్సు ఉన్న వారే ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కుంటున్నారు. జుట్టు ఊడ‌కుండా చూసుకోవాలంటే ముందు ఎందుకు జుట్టు ఊడుతుంద‌నే కార‌ణాలు తెలుసుకోవాలి. మ‌న ఆహార అల‌వాట్లు, మాన‌సిక ఆందోళ‌న‌లే జుట్టు ఊడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు.

కాబ‌ట్టి, కొన్ని చిన్న చిన్న చిట్కాల‌ను పాటించ‌డం, ఆహార అల‌వాట్ల‌లో మార్పులు చేసుకోవ‌డం, మాన‌సిక ఆందోళ‌న‌ల‌కు దూరంగా ఉండ‌టం ద్వారా జుట్టు రాలే స‌మ‌స్య‌ను పూర్తిగా త‌గ్గించుకోవ‌చ్చు. నిజానికి జుట్టు ఊడ‌టం అంద‌రికీ జ‌రిగేది. ప్ర‌తీ రోజు సుమారు 100 వెంట్రుక‌లు ఊడ‌టం, కొత్తగా 100 వెంట్రుక‌లు రావ‌డం స‌హ‌జ ప్ర‌క్రియ‌. అయితే, వెంట్రుక‌లు ఊడుతున్నా కొత్త‌వి రాక‌పోవ‌డం ఒక స‌మ‌స్య. 100 కంటే ఎక్కువ వెంట్రుక‌లు ఊడ‌టం మ‌రో స‌మ‌స్య‌. ఈ రెండు స‌మ‌స్య‌లు ఉంటే జుట్టు ఊడుతుంద‌ని అనుకోవచ్చు.

వేడి నీటితో త‌ల స్నానం చేయ‌డం వెంట్రుక‌ల‌కు అంత మంచిది కాదు. ఎక్కువ వేడి నీటిని త‌ల‌కు పోయ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు ఆ వేడికి దెబ్బ‌తిని జుట్టును బ‌లహీనం కావ‌డానికి కార‌ణ‌మ‌వుతాయి. అందుకే జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంది. ప్ర‌తి రోజూ చ‌న్నీరు లేదా గోరు వెచ్చ‌టి నీటితో మాత్ర‌మే త‌ల స్నానం చేయాలి. చ‌న్నీటితోనే చేస్తే ఇంకా మంచిది. ఇలా చేస్తే జుట్టు కుదుళ్లు గ‌ట్టిగా మారుతాయి. జుట్టు కూడా ఊడ‌దు.

జుట్టు ఊడ‌కుండా ఉండేందుకు ర‌క‌ర‌కాల షాంపూలు వాడుతుంటారు చాలామంది. కానీ, షాంపుల‌ను వాడ‌టం మానేయ‌డం ద్వారా జుట్టును కూడా కాపాడుకోవ‌చ్చు. షాంపుల‌కూ బ‌దులు కుంకుడుకాయ ర‌సంతో త‌ల‌స్నానం చేయ‌డం ద్వారా జుట్టు బ‌లంగా మారుతుంది. త‌ల స్నానం చేసిన త‌ర్వాత త‌ల పూర్తిగా ఆర‌క‌ముందే కొబ్బ‌రి నూనె పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఎండ వ‌ల్ల జుట్టు, కుదుళ్లు పాడుకాకుండా ఉంటాయి.

జుట్టు ఊడిపోకుండా ఉండ‌టానికి ఆహార అల‌వాట్ల‌లో మార్పు చాలా అవ‌స‌రం. ఆహారంలో ఆకుకూర‌లు ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. ఉద‌యం పూట మొల‌కెత్తిన గింజ‌లు తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. వీటిల్లో మాంస‌కృత్తులు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి జుట్టు బాగా పెర‌గడానికి ఉప‌యోగ‌ప‌డతాయి. పెస‌ర్లు, అల‌సంద‌లు, సెన‌గ‌లతో మొల‌క‌లు చేసుకొని, అందులో కొబ్బ‌రి, వేరు శ‌న‌గ ప‌ప్పులు కూడా కొన్ని వేసుకొని తిన‌డం జుట్టుకు మంచిది. ఈ చిట్కాలు పాటిస్తే వెంట్రుక‌లు ఊడిపోతున్నాయ‌నే స‌మ‌స్య ఉండ‌దు.

Related News