logo

  BREAKING NEWS

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!  |  

మొటిమలు పోవాలంటే ఏం చేయాలి ? మొటిమలు పోవడానికి చిట్కాలు

ముఖంపై మొటిమ‌లు రావ‌డం అనేది చూడ‌టానికి చిన్న స‌మ‌స్య‌గానే ఉంటుంది కానీ మొటిమ‌లు ఎక్కువ అవుతున్నాయంటే శ‌రీరంలో మ‌రేదో అనారోగ్య స‌మ‌స్య కూడా ఏర్ప‌డుతోంద‌ని అర్థం. ఇక‌, మొటిమ‌లు అమ్మాయిల‌ను బాగా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, కొన్ని చిన్న చిన్న చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఇంట్లోనే మొటిమ‌ల‌కు చికిత్స చేసుకోవ‌చ్చు. ముందుగా అస‌లు మొటిమ‌లు రావ‌డానికి కార‌ణాల‌ను అర్థం చేసుకోవాలి.

మొటిమ‌లు అంటే ఏంటి ?
చ‌ర్మంలోని చెమ‌ట గ్ర‌థుల్లో ఉండే సీబ‌మ్ అనే ప‌దార్థం చ‌ర్మంపై చేరే బ్యాక్టీరియాతో కొన్ని ర‌సాయ‌నిక చ‌ర్య‌లు జ‌ర‌గ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ త‌యార‌వుతుంది. సీబ‌మ్ ప‌దార్థాన్ని ఉత్ప‌త్తి చేసే సెబేసియ‌స్ నాళాలు పూడుకుపోతాయ‌ని. దీంతో శ‌రీరం లోప‌ల తెల్ల లేదా న‌ల్ల కొస‌ల‌తో గ‌ట్టి పొక్కులు ఏర్ప‌డ‌తాయి. వీటినే మొటిమ‌లు అంటారు.

మొటిమ‌లు రావ‌డానికి కార‌ణాలు ?
స‌హ‌జంగా మ‌ల‌బ‌ద్ధ‌కం ఎక్కువ‌గా ఉన్న వారికి చ‌ర్మంలో వ్య‌ర్థ‌ప‌దార్థాలు పేరుకొని పోయి మొటిమ‌లు వ‌స్తుంటాయి. నీరు మ‌న చ‌ర్మాన్ని శుభ్రం చేస్తుంది. నీళ్లు త‌క్కువ‌గా తాగేవారికి చ‌ర్మం స‌రిగ్గా శుభ్రం కాక మొటిమ‌లు వ‌స్తుంటాయి. ఎక్కువ వేయించిన ఆహారం, జంక్ ఫుడ్ తిన‌డం వ‌ల్ల కూడా మొటిమ‌లు వ‌స్తాయి.

మొటిమ‌లు త‌గ్గ‌డానికి చిట్కాలు ఏంటి ?
మొటిమ‌లు ఎక్కువ‌గా ఉన్న‌వారు ఎక్కువ‌గా మంచినీటిని తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. రోజుకు క‌నీసం 5 లీట‌ర్ల నీరు తాగ‌డం మొటిమ‌లను అరిక‌ట్ట‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉద‌యం వేళ క్యారెట్ జ్యూస్‌, సాయంత్రం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగితే చ‌ర్మంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు త్వ‌ర‌గా పోయి ముఖంలో గ్లో వ‌స్తుంది. ఈ జ్యూస్‌ల వ‌ల్ల ర‌క్తంలో ఏమైనా స‌మ‌స్య‌లు ఉన్నా తొలిగిపోతాయి. మ‌ల‌బ‌ద్ధ‌కం త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. మ‌ల విస‌ర్జ‌న సాఫీగా జ‌రిగితే శ‌రీరంలో వ్య‌ర్థాలు ఉండ‌వు. మొటిమ‌లు కూడా రావు. చాలా మంది మొటిమ‌ల‌ను గిల్లుతుంటారు. ఇలా ఎట్టి ప‌రిస్థితుల్లో చేయ‌వ‌ద్దు. మొటిమ‌ల‌ను గిల్లితే మ‌చ్చ‌లు రావ‌డంతో పాటు చ‌ర్మంపై గుంట‌లు ప‌డ‌తాయి. మొటిమ‌లు త‌గ్గించుకోవ‌డానికి జంక్ ఫుడ్‌, వేయించిన ఆహారం కూడా మానేయ‌డం మంచిది.

Related News