logo

  BREAKING NEWS

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!  |  

డ‌స్ట్ ఎల‌ర్జీ త‌గ్గించుకోవడానికి సింపుల్ చిట్కాలు

డ‌స్ట్ ఎల‌ర్జీ కొంద‌రిని విప‌రీతంగా వేధించే స‌మ‌స్య‌. డ‌స్ట్ ఎల‌ర్జీ ఉన్న‌వారికి ఏ మాత్రం దుమ్ము త‌గిలినా తుమ్ములు రావ‌డం మొద‌లువుతుంది. ముఖం ఎర్రబ‌డుతుంది. కంటి దుర‌ద‌లు వ‌స్తాయి. ఇలా ర‌క‌ర‌కాల ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఈ స‌మ‌స్య‌ల భ‌యంతో డ‌స్ట్ ఎల‌ర్జీ ఉన్న వాళ్లు జాగ్ర‌త్త‌గా ఉంటారు. దుమ్ము, ధూళికి వెళ్ల‌కుండా ఇంట్లోనే ఉండిపోతారు. ఫ‌లితంగా చాలా ప‌నులు చేయ‌లేరు. డ‌స్ట్ ఎల‌ర్జీ అనేది శాశ్వ‌త స‌మ‌స్య అని, దీనిని భ‌రించ‌క త‌ప్ప‌ద‌ని వీరంతా మాన‌సికంగా ఒక అభిప్రాయానికి వ‌చ్చేస్తారు.

డ‌స్ట్ ఎల‌ర్జీ ఉంది క‌దా అని దుమ్ము, ధూళి, పొగ‌లోకి వెళ్ల‌కుండా ఉండాలంటే చాలా క‌ష్టం. ఎవ‌రైనా స‌రే దుమ్ము, ధూళికి భ‌య‌ప‌డి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఉండ‌టం సాధ్యం కాదు. అంతేకాదు, బ‌‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఉంటూ ఎప్పుడైనా త‌ప్ప‌ని ప‌రిస్థితిలో వెళ్లిన‌ప్పుడు డ‌స్ట్ ఎల‌ర్జీ వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌లు ఇంకా ఎక్కువవుతాయి. కాబ‌ట్టి, డ‌స్ట్ ఎలర్జీకి భ‌య‌ప‌డి ఇంట్లో ఉండ‌టం కంటే దీనిని త‌గ్గించుకోవ‌డ‌మే మంచి మార్గం. అంద‌రూ అనుకుంటున్న‌ట్లుగా ఇదేమీ శాశ్వ‌త స‌మ‌స్య కాదు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే డ‌స్ట్ ఎల‌ర్జీని పూర్తిగా దూరం చేసుకోవ‌చ్చు.

డ‌స్ట్ ఎల‌ర్జీ ఉన్న వారికి బ్రీతింగ్ ఎక్స‌ర్‌సైజెస్ చాలా మేలు చేస్తాయి. ప్ర‌తి రోజు ఉద‌యం పూట అర‌గంట పాటు దీర్ఘ‌శ్వాస‌ల ప్రాణాయామం చేస్తే ముక్కు లోప‌లి భాగాల‌లో ఉండే ఇన్‌ఫెక్ష‌న్ వెళ్లిపోతుంది. ప్ర‌తి రోజూ క‌నీసం ఐదు లీట‌ర్ల నీళ్లు తాగాలి. చ‌ల్ల‌టి నీళ్లు తాగ‌వ‌ద్దు. అవ‌కాశం ఉంటే గోరువెచ్చ‌టి నీళ్లు ఎక్కువ‌గా తాగ‌డం మంచిది.

డ‌స్ట్ ఎల‌ర్జీ ఉన్న వారికి ఆవిరి పెట్టుకోవ‌డం చాలా ఉప‌శ‌మ‌నం ఇస్తుంది. ముఖానికి కొద్దిగా నూనె రాసుకొని రోజుకు ఒక‌సారి వేడి నీటితో ఆవిరి ప‌ట్టుకుంటే ఈ స‌మ‌స్య చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. డ‌స్ట్ ఎల‌ర్జీ ఉన్న వారు తీసుకునే ఆహారం ప‌ట్ల కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప్ర‌కృతిసిద్ధ‌మైన ఆహారాన్ని ఎక్కువ‌గా తినేందుకు ప్ర‌య‌త్నించాలి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగే ఆహారం తీసుకుంటే డ‌స్ట్ ఎల‌ర్జీ రాదు.

డ‌స్ట్ ఎల‌ర్జీ స‌మ‌స్య‌కు భ‌య‌ప‌డి ఇంట్లోనే ఉంటే ఈ స‌మ‌స్య ఎప్ప‌టికీ పోదు. పైగా ఎప్పుడైనా దుమ్ములోకి వెళ్లాల్సి వ‌స్తే మ‌రింత దూర‌మ‌వుతుంది. కాబ‌ట్టి, ఈ జాగ్ర‌త్త‌లు తీసుకొని ఈ స‌మ‌స్య‌ను క్ర‌మంగా త‌గ్గించుకోవ‌డ‌మే మంచిది.

Related News