logo

  BREAKING NEWS

గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |  

మెడ‌నొప్పి బాధిస్తోందా..? ఈ చిట్కాలు పాటించండి.. 15 రోజుల్లో త‌గ్గిపోతుంది

స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చాక మెడ ఎప్పుడూ వంచి ఫోన్‌లో త‌ల పెట్ట‌డం చాలా మందికి అల‌వాటుగా మారింది. రాత్రి ప‌డుకునే వ‌ర‌కు కూడా ఫోన్ వ‌ద‌ల‌రు. కొంద‌రైతే ప‌డుకున్నాక కూడా ఎత్తైన దిండు పెట్టుకుని ఫోన్ చూస్తూ గ‌డుపుతుంటారు. ఇటువంటి వారు ఎక్కువ‌గా మెడ‌నొప్పి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. మెడ ఎప్పుడూ ముందుకు వంచి ప‌నులు చేసేవారు, ఎత్తు దిండు పెట్టుకొని ప‌డుకునే వారిని మెడ‌నొప్పి ఎక్కువ‌గా బాధిస్తూ ఉంటుంది. అస్స‌లు వ్యాయామం చేయ‌ని వారికి కూడా ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌స్తుంటుంది.

మెడ ఎక్కువ‌గా ముందుకు వంచ‌డ‌మే మెడ నొప్పికి ప్ర‌ధాన కార‌ణం. ఇలా చేసిన‌ప్పుడు మెడ పూస‌లు, డిస్క్ మీద బాగా ఒత్తిడి ప‌డుతుంది. ఎక్కువ ఒత్తిడి ప‌డ్డ‌ప్పుడు మెడ‌నొప్పి మొద‌ల‌వుతుంది. ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యంగా చేస్తే మ‌రింత ముదిరి కొత్త స‌మ‌స్య‌లు కూడా మొద‌ల‌వుతాయి. ఒక్కోసారి మెడ, చేతుల భాగంలో తిమ్మిర్లు రావ‌డం, చేతుల‌లో న‌రాలు లాగిన‌ట్లు ఉండ‌టం, వ్రేళ్ళు ప‌ట్టుకోల్పోయిన‌ట్లు ఉండ‌టం వంటివి కూడా మెడ‌నొప్పికి సంబంధించి సమ‌స్య‌లు. ఇవి కూడా మెడ ఎక్కువ‌గా ముందుకు వంచ‌డం వ‌ల్లే వ‌స్తాయి.

స‌మ‌స్య‌ను ముందుగానే గుర్తించి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా ఉంటే మ‌రింత ముదిరి కొత్త స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌ళ్లు తిర‌గ‌డం, ప‌డిపోవ‌డం, త‌ల‌నొప్పి రావ‌డం వంటి ఇబ్బందులు కూడా త‌లెత్తులాయి. కాబ‌ట్టి, చిన్న చిన్న జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా మెడ‌నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు. ఎక్కువ‌గా మెడ ముందుకు వంచేవారికి ఇప్ప‌టికి ఈ స‌మ‌స్య‌లు లేక‌పోయినా భ‌విష్య‌త్‌లో క‌చ్చితంగా వ‌స్తాయి. కాబ‌ట్టి, వీరు కూడా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

మెడనొప్పి ఉన్న వారు త‌ల కింద దిండు పెట్టుకోవ‌డం మానేయాలి. ఒక‌వేళ పెట్టుకున్నా ఎత్తు చాలా త‌క్కువ‌గా ఉన్న‌వి మాత్ర‌మే పెట్టుకోవాలి. కంప్యూట‌ర్ల‌పై ప‌ని చేసేట‌ప్పుడు, ఆఫీసులో ప‌ని చేసుకునేట‌ప్పుడు నిటారుగా కూర్చోవ‌డంతో పాటు మెడ వంచ‌కుండా స్ట్రైట్‌గా ఉండేట‌ట్లు చూసుకోవాలి. మెడ‌నొప్పి త‌గ్గించుకోవ‌డానికి ముందుగా మెగ భాగంలో కొబ్బ‌రి నూనె రాసుకొని వేడి నీటితో రెండు పూట‌లా ప‌ది నిమిషాల పాటు కాప‌డం పెట్టుకుంటే నొప్పి నుంచి చాలా వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

మెడ నొప్పి ఉన్న‌వారు, ఎక్కువ‌గా కంప్యూట‌ర్లు, ఫోన్లు వినియోగించే వారు ప్ర‌తీ గంటకు ఒక‌సారి లేచి మెడ‌కు సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు రెండు నిమిషాలు పాటైనా చేసుకోవ‌డం చాలా మంచిది. మెడ నొప్పి ఉన్న వారు యోగా చేసే అల‌వాటు ఉంటే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. మెడ ముందుకు వంచే ఆస‌నాలు వేయ‌వ‌ద్దు. మెడ వెన‌క్కు వంచే మ‌త్య్సాస‌నం, ఉష్ట్రాస‌నం, భుజంగాస‌నం వంటివి చేయ‌డం మంచిది. ఈ జాగ్ర‌త్త‌లు 15 రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే మెడ‌నొప్పి త‌గ్గిపోతుంది.

Related News