logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?

కొంద‌రిని క‌డుపులో మంట విప‌రీతంగా వేధిస్తూ ఉంటుంది. ఈ మంట తాళ‌లేక‌, త‌గ్గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల టాబ్లెట్లు వేసుకోవ‌డం, ఏవేవో పౌడర్‌లు నీళ్ల‌లో క‌లుపుకొని తాగ‌డం వంటివి చేస్తుంటారు. అయితే ట్యాబ్లెట్లు, మందులు ఈ స‌మ‌స్య నుంచి తాత్కాలిక ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి కానీ పూర్తి స్థాయిలో త‌గ్గ‌దు. ఇంకొంద‌రు వారికి వారే పులుపు తిన‌డం వ‌ల్ల‌, కారం తిన‌డం వ‌ల్ల క‌డుపులో మంట వ‌స్తోంద‌ని భావిస్తూ పులుపు, కారం ఆహారం తినడం మానేస్తూ ఉంటారు. ఇలా చేయ‌డం కూడా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కాదు.

కొంద‌రు క‌డుపులో మంట వ‌చ్చిన‌ప్పుడు చెక్కెర క‌లిపిన నీళ్లు, ‌పాలు, సోడా, కూల్ డ్రింక్స్ వంటివి తాగుతుంటారు. మ‌రికొంద‌రు తియ్య‌టి ఆహారం తింటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా క‌డుపులో మంట కొంత‌సేపు వ‌ర‌కు త‌గ్గుతుంది కానీ పూర్తిగా త‌గ్గ‌దు. త‌గ్గ‌క‌పోగా వీటి వ‌ల్ల త‌ర్వాత క‌డుపులో మంట మ‌రింత ఎక్కువ కూడా అయ్యే ప్ర‌మాదం ఉంటుంది. కాబ‌ట్టి, ఇలాంటి తాత్కాలిక ప‌రిష్కారాలు కాకుండా శాశ్వాత ప‌రిష్కారాల కోసం ప్ర‌య‌త్నించాలి.

క‌డుపులో మంట‌ను ఎసిడిటీ అంటారు. శ‌రీరంలో యాసిడ్ ఉత్ప‌త్తి అయిన‌ప్పుడు ఈ స‌మ‌స్య చాలా వ‌ర‌కు వ‌స్తుంటుంది. ఆహారం స‌రిగ్గా అర‌గ‌క‌పోయినా క‌డుపులో మంట వ‌స్తుంది. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. టెన్ష‌న్‌లు పెట్టుకోవ‌డం వ‌ల్ల కూడా శ‌రీరంలో యాసిడ్ ఉత్ప‌త్తి పెరిగి క‌డుపులో మంట వ‌స్తుంది. మంచినీళ్లు త‌క్కువ‌గా తాగ‌డం వ‌ల్ల క‌డుపులో, పేగుల్లో జిగురు త‌గ్గి మంట వ‌స్తుంది. టీ, కాఫీ ఎక్కువ‌గా తాగినా యాసిడ్ ఉత్ప‌త్తి ఎక్కువై మంట రావ‌చ్చు. తినేట‌ప్పుడు నీళ్లు ఎక్కువ‌గా తాగినా క‌డుపులో మంట వ‌స్తుంది.

పెయిన్ కిల్ల‌ర్ ట్యాబ్లెట్స్ ఎక్కువ‌గా వాడ‌టం, మాంసం ఎక్కువ‌గా తిన‌డం, వేయించిన ఆహారం ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల కూడా క‌డుపులో యాసిడ్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యి మంట వ‌స్తుంది. కాబట్టి, క‌డుపులో మంట వ‌స్తే ముందుగా ఎందుకు వ‌స్తుంద‌నేది ఇప్పుడు చెప్పిన కార‌ణాల‌తో చెక్ చేసుకొని చూడాలి. క‌డుపులో మంట త‌గ్గించుకోవ‌డానికి ఈ చిట్కాలు పాటించ‌డం ద్వారా త్వ‌ర‌గా ఫ‌లితం ఉంటుంది.

ప్ర‌తీ రోజు క‌నీసం ఐదు లీట‌ర్ల మంచినీళ్లు తాగాలి. కానీ, తిన‌డానికి పావు గంట ముందు నుంచి, తిన్నాక గంట వ‌ర‌కు మంచినీళ్లు ఎంత త‌క్కువ తాగితే అంత మంచిది. టీ, కాఫీ, మాంసం వీలైనంత వ‌ర‌కూ త‌గ్గించుకోవ‌డం లేదా పూర్తిగా మానేయ‌డం ద్వారా క‌డుపులో మంట స‌మ‌స్య‌ను త్వ‌ర‌గా అదుపు చేయ‌వ‌చ్చు. కొంచెం మోతాదులో ఎక్కువ‌సార్లు తిన‌డం, చిరుతిండ్లు త‌ర‌చూ తిన‌డం మానేయాలి. మూడుసార్లే కడుపు నిండా తినాలి. కడుపులో మంట మ‌రీ ఎక్కువ‌గా ఉంటే గోరు వెచ్చ‌టి నీటిలో కొంచెం తేనె క‌లుపుకొని తాగితే త‌గ్గిపోతుంది.

Related News