logo

  BREAKING NEWS

రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?  |   Breaking: వ‌ర‌ద బాధితుల‌కు భారీ సాయం ప్ర‌క‌టించిన కేసీఆర్‌  |   టీడీపీ క‌మిటీల నియామ‌కం.. లోకేష్‌, బాల‌య్య‌, సుహాసినికి కీల‌క ప‌ద‌వులు  |   బిగ్ బ్రేకింగ్‌: రెండు రాష్ట్రాల‌కు టీడీపీ అధ్య‌క్షుల నియామ‌కం  |   వ్యాక్సిన్ వ‌చ్చినా క‌రోనా ఇక ఎప్ప‌టికీ మ‌న‌తోనే ఉంటుంద‌ట‌  |   పాకిస్థాన్‌ వ‌ల్ల మ‌న పానీపూరీ రేట్లు పెరుగుతున్నాయి తెలుసా ?  |   హ‌య‌త్‌న‌గ‌ర్ టీఆర్ఎస్‌ కార్పొరేట‌ర్‌ను గ‌ల్లా ప‌ట్టి కొట్టిన మ‌హిళ‌లు  |   వ‌ర్షాన్ని ఎలా కొలుస్తారు ? మ‌ల్లీమీట‌ర్లు, సెంటీమీట‌ర్ల‌లోనే ఎందుకు కొలుస్తారు ?  |   ఈ సింపుల్ చిట్కాల‌తో సులువుగా పొట్ట త‌గ్గించుకోవ‌చ్చు  |   జ‌గ‌న్ మాత్ర‌మే కాదు.. ఎన్టీఆర్‌, చిరంజీవిని దించిన నాగ‌బాబు  |  

ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం

చాలా మందిని ఎక్కువ‌గా ఇబ్బంది పెట్టే స‌మ‌స్య త‌ల‌నొప్పి. త‌ల‌నొప్పిని భ‌రించ‌లేక ఎక్కువ మంది ట్యాబ్లెట్ల‌ను ప‌రిమితికి మించి వాడుతుంటారు. త‌ల‌నొప్పి ఉందంటూ త‌ర‌చూ టీ తాగుతుంటారు. ఇటువంటివి తాత్కాలికంగా త‌ల‌నొప్పి నుంచి మ‌న‌కు కొంత‌మేర ఉప‌శ‌మ‌నం ఇస్తాయి. కానీ, శాశ్వ‌తంగా ఈ స‌మ‌స్య‌కు మాత్రం టీ తాగ‌డం, ట్యాబ్లెట్లు వేసుకోవ‌డం ప‌రిష్కారం కాదు. చిన్ని చిన్న జాగ్ర‌త్త‌ల వ‌ల్ల త‌ల‌నొప్పిని శాశ్వ‌తంగా త‌గ్గించుకునే అవ‌కాశం ఉంటుంది.

త‌ల‌నొప్పి రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఒక్కొక్క‌రిలో ఒక్కో కార‌ణం వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే టీ, కాఫీ ఎక్కువ తాగ‌డం వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంది. మంచినీళ్లు త‌క్కువ‌గా తాగ‌డం వ‌ల్ల‌, గ్యాస్ ట్ర‌బుల్ వ‌ల్ల‌, జీర్ణ స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంద‌నే విష‌యం కూడా చాలా మందికి అవ‌గాహ‌న ఉండ‌దు. ర‌క్తం త‌క్కువ‌గా ఉన్నా, మెడ నొప్పి ఉన్నా త‌లనొప్పి రావ‌చ్చు. కాబ‌ట్టి, త‌ల‌నొప్పికి కార‌ణాల‌ను అర్థం చేసుకొని ఇంట్లోనే వైద్యం చేసుకోవ‌డం ద్వారా త‌ల‌నొప్పిని త‌గ్గించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌కృతి వైద్య నిపుణులు చెబుతున్నారు.

త‌ల‌నొప్పి వ‌చ్చిన‌ప్పుడు త‌డిగుడ్డ‌ను మాడుపై పావుగంట పాటు పెట్టుకొని, రెండు పాదాల‌ను వేడి నీటిలో పెట్టి కూర్చోవాలి. ఇలా చేస్తే త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మంచినీళ్లు త‌క్కువ‌గా తాగ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుంది కాబ‌ట్టి ప్ర‌తీ రోజూ క‌చ్చితంగా 5 లీట‌ర్ల మంచినీళ్లు తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తి గంట‌కు ఒక గ్లాసు నీళ్లు తాగ‌డం్ ఆరోగ్యానికి చాలా మంచిది. మ‌ల‌బ‌ద్ధ‌కం లేకుండా చూసుకోవాలి.

త‌ల‌స్నానం చేస్తే త‌ల‌నొప్పి ఎక్కువ‌వుతుంది అనుకుంటారు. కానీ, చ‌న్నీటితో త‌ల‌స్నానం చేస్తే రెండుమూడు రోజుల పాటు కొంత‌సేపు త‌ల‌నొప్పి ఎక్కువైన‌ట్లు అనిపించినా త‌ర్వాత త‌గ్గిపోతుంది. త‌ల‌స్నానం వ‌ల్ల త‌ల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంది. త‌ల‌లో వేడి కూడా త‌గ్గుతుంది. టీ, కాఫీలు ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి, టీ, కాఫీ బ‌దులు తేనె వేసుకొని నిమ్మ‌ర‌సం, ఫ్రూట్ జ్యూస్‌లు తాగ‌డం ఆరోగ్యానికి మంచిది. జీర్ణ ప్ర‌క్రియ‌లో స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంది కాబ‌ట్టి జీర్ణ‌క్రియ బాగా జ‌రిగేందుకు ప్ర‌తీ రోజూ ఉద‌యం మొల‌క‌లు, పండ్లు తిన‌డం మంచిది.

Related News