logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఆల్కహాల్ వల్ల వచ్చే హ్యాంగోవర్, ముఖంలో వాపును ఇలా తగ్గించుకోండి

చాలా మంది రాత్రి ఆల్కహాల్ ను అధికంగా తీసుకోవడం వలన ఉదయాన్నే హ్యాంగోవర్ తో బాధపడుతుంటారు. ఉదయం లేచే సరికి తలనొప్పి, ఇబ్బందిగా ఉండటం, ఏ పని చేయాలనిపించకపోవటం ఇవన్నీ అందుకు సంబందించిన సైడ్ ఎఫెక్ట్స్. దాని నుంచి ఉపశమనం పొందేందుకు మళ్లీ మద్యాన్నే ఆశ్రయిస్తుంటారు. అలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. హ్యాంగోవర్ కారణంగా ఉదయాన్నే ముఖ్యం, కళ్ళు వాచినట్టుగా కనిపిస్తుంది. ఇది కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లాలన్నా రాత్రి అతిగా మద్యం సేవించిన విషయం మీ ముఖంలో స్పష్టంగా తెలిసిపోతుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఆల్కహాల్ ద్వారా వచ్చే హ్యాంగోవర్ ను దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ను నిమిషాల్లో తగ్గించుకోవచ్చు.

హ్యాంగోవర్ కు ముఖ్య కారణం డీ హైడ్రేషన్. ఆల్కహాల్ కారణంగా శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఒక్కోసారి ఇది ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకే మద్యం తాగిన వారు నీటిని ఎక్కువగా తాగాలి. ఒక కప్పు కాఫీ తాగడం వలన హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలుగుతుందని చాలా మంది చెప్పే మాట. కానీ అది నిజం కాదు. కాఫీలో ఉండే కెఫీన్ శరీరాన్ని మరింతగా డీ హైడ్రేట్ చేస్తుంది. అయితే కళ్ళ చుట్టూ ఉన్న వాపును కెఫీన్ తగ్గించగలదు. అందుకోసం కెఫీన్ ఆధారిత కంటి క్రీములను వాడవచ్చు. ముఖం లో వాపు తగ్గడానికి ఉదయాన్నే ఐస్ క్యూబులు వేసిన నీటిలో కాసేపు ముఖాన్ని ఉంచాలి. రక్తప్రసరణ బాగా జరిగి ముఖం ఫ్రెష్ గా కనిపిస్తుంది.

హ్యాంగోవర్ తో బాధపడేవారు ఉదయం లేవగానే నీళ్లు ఎక్కువగా తాగాలి. లేదంటే నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగాలి. హ్యాంగోవర్ ను తగ్గించడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పని చేస్తాయి. ఉదయాన్నే కాఫీలు బదులుగా ఒక గ్లాసు కొబ్బరి నీటికి తాగి చూడండి. ఇంకా తక్కువ సమయంలో ఈ సమస్య నుంచి బయటపడాలంటే పాలు కలిపిన బనానా జ్యూస్‌ కూడా సూపర్‌గా పనిచేస్తుంది. ఆరెంజ్ లాంటి సిట్రస్ ఉన్న పండ్ల రసాల వల్ల కూడా వెంటనే హ్యాంగోవర్ తగ్గిపోతుంది. నువ్వులు బెల్లం కలిపి కలిపి తినవచ్చు. ఇవేవి అందుబాటులో లేని వారు గ్లాసు మజ్జిగ తాగినా సరిపోతుంది.

ఈ చిట్కాలన్నీ ఆల్కహాల్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను మాత్రమే తగ్గించగలవు. తరచుగా ఆల్కహాల్ తాగేవారికి దీర్ఘకాలికంగా గుండె జబ్బులు వేధిస్తాయి. గుండె కొట్టుకునే వేగం పెరగటం లేదా నాడి సరిగ్గా అందకపోవటం, ఊపిరి అందకపోవటం, అలసట, నిద్రలేమి, ఛాతీలో నొప్పి, కళ్ళు తిరగటం వంటి సమస్యల బారిన పడతారు. వీటి కారణంగా జీవనప్రమాణం పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే మద్యానికి దూరంగా ఉండి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవడం ఎంతైనా అవసరం.

Related News