logo

  BREAKING NEWS

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |  

నీర‌సంగా ఉందా ? ఈ చిన్న చిట్కాతో వెంట‌నే యాక్టీవ్ అయిపోతారు

మ‌నం తింటున్న ఆహారమో, మ‌న జీవ‌న విధాన‌మో, మ‌రేదేనా కార‌ణ‌మో గానీ మ‌న ఇంట్లో పెద్ద వారైనా మన తాత‌లు, బామ్మ‌లు ఉన్నంత యాక్టీవ్‌గా మ‌నం ఉండ‌లేక‌పోతున్నాం. ఎంత వ‌య‌స్సు వ‌చ్చినా, ఏ ప‌ని చేసినా వారికి అల‌స‌ట అనేది తెలియ‌దు. కానీ, మ‌నం మాత్రం ఏ ప‌ని చేయ‌క‌పోయినా నీర‌సంగా మారిపోతుంటాం. చిన్న వ‌య‌స్సు వారు కూడా నీర‌సంతో త‌ర‌చూ ఇబ్బంది ప‌డుతుంటారు. అందుకే చిన్న చిన్న ప‌నులు కూడా స్వ‌యంగా చేసుకోలేరు.

నీర‌సానికి కార‌ణం ఒంట్లో శ‌క్తి లేక‌పోవ‌డం. బ‌ల‌మైన ఆహారం తిన‌క‌పోవ‌డం వ‌ల్లే ఒంటికి కావాల్సిన శ‌క్తి అంద‌దు. ఇటువంటి స‌మ‌యంలోనే నీర‌సం మొద‌ల‌వుతుంది. మ‌న‌మంతా రుచిక‌ర‌మైన ఆహారం తింటున్నాం కానీ బ‌ల‌మైన, ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే ఆహారం మాత్రం తిన‌డం లేదు. అందుకే ఒక గంట ఏదైనా ప‌ని చేస్తే పూర్తిగా నీర‌సంగా మారిపోతుంటాం.

నీర‌సం త‌గ్గాలంటే మ‌నం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని బ‌ల‌మైన ఆహారం తిన‌డం ఒక్క‌టే మార్గం. ఖ‌ర్జూర పండు మ‌న శ‌రీరానికి త‌క్కువ స‌మ‌యంలో, ఎక్కువ శ‌క్తిని అందిస్తుంది. అందుకే ఉప‌వాసాలు వీడిన‌ప్పుడు వెంట‌నే ఖ‌ర్జూర పండు తింటాం. ఖ‌ర్జూర పండు తిన‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గిపోయి యాక్టీవ్‌గా మార‌తాం. ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం ఖ‌ర్జూర పండు తిన‌డం అల‌వాటు చేసుకోవ‌డం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పుడైనా మీకు నీర‌సంగా అనిపించినా నాలుగైదు ఖ‌ర్జూర పండ్లు తింటే నీర‌సం త‌గ్గిపోతుంది.

కొబ్బ‌రి కూడా మ‌న శ‌రీరానికి ఎక్కువ శ‌క్తిని ఇస్తుంది. మ‌న‌లో చాలా మంది నీర‌సంగా ఉంటే కొబ్బ‌రి నీళ్లు తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొబ్బ‌రి నీళ్లు మాత్ర‌మే కాదు ప‌చ్చి కొబ్బ‌రి కూడా మంచి బ‌ల‌మైన ఆహారం. ప్ర‌తీ రోజు ఉద‌యం పూట ప‌చ్చి కొబ్బ‌రి తింటే ఆ రోజంతా శ‌రీరం ఉత్సాహంగా ఉంటుంది. కొబ్బ‌రి నీళ్లు తాగిన‌ప్పుడు కూడా కొబ్బ‌రిని వ‌దిలేయ‌కుండా తీయించుకొని తినాలి.

నీర‌సంగా ఉన్న వారికి తేనె దివ్యౌష‌దంలా ప‌ని చేస్తుంది. బాగా నీర‌సంగా అనిపించినా, క‌ళ్లు తిరుగుతున్న‌ట్లు అనిపించినా కొంచెం తేనెను నాకితే ఒంటికి శ‌క్తి వ‌చ్చి, నీర‌సం త‌గ్గిపోతుంది. ఉద‌యం ప‌డిగ‌డుపున గోరువెచ్చ‌టి నీటిలో కొంచెం తేనె, నిమ్మ‌ర‌సం క‌లుపుకొని తాగ‌డం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేస్తే ఆ రోజంగా మ‌నం ఉత్సాహంగా ఉండ‌టం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ చిన్న చిన్న చిట్కాల‌ను పాటించి నీర‌సాన్ని దూరం చేసుకొని రోజంతా యాక్టీవ్‌గా ఉండ‌వ‌చ్చు.

Related News