logo

  BREAKING NEWS

బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |   నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |  

ఈ చిన్న చిట్కాతో 2 రోజుల్లో మీ త‌ల‌పై చుండ్రు మాయం

మ‌న‌లో చాలా మందిని జుట్టుకు చుండ్రు స‌మ‌స్య బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చుండ్రు స‌మ‌స్య వ‌ల్ల వెంట్రుక‌లు బ‌ల‌హీనంగా మారిపోవ‌డం, రాలిపోవ‌డం జ‌రుగుతూ ఉంటుంది. చుండ్రు ఎక్కువ‌గా ఉన్న జుట్టు చూడ‌టానికి కూడా అంత బాగా క‌నిపించ‌దు. చుండ్రును త‌గ్గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల యాంటీ డాండ్ర‌ఫ్ శాంపూలు, జెల్స్ వాడుతుంటాం. కానీ, ఏదీ కూడా చుండ్రుకు పూర్తి స్థాయి ప‌రిష్కారం ఇవ్వ‌దు.

చుండ్రు ఎందుకు వ‌స్తుంది అనే కార‌ణాల‌ను తెలుసుకుంటే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కూడా మ‌నకే అర్థ‌మైపోతుంది. ఇప్పుడు మ‌న‌లో చాలా మందికి చుండ్రు స‌మ‌స్య ఉంటుంది కానీ మ‌న పెద్ద వాళ్ల‌కు అస‌లు ఈ స‌మ‌స్య‌నే ఉండ‌దు. ఈ విష‌యాన్ని మీరు మ‌న ఇంట్లో బామ్మ‌ల‌ను, తాత‌ల‌ను ప‌రిశీలించి తెలుసుకోవ‌చ్చు. త‌ల‌స్నానం క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌క‌పోవ‌డం, షాంపూలు ఎక్కువ‌గా వాడ‌టం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య వ‌స్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు.

మ‌న చ‌ర్మం వివిధ ర‌కాల వాతావ‌ర‌ణాల నుండి ర‌క్షించుకోవ‌డానికి కొవ్వు ప‌దార్థాన్ని చ‌ర్మంలో ఉండే కొట్లాది సూక్ష్మ రంధ్రాల నుంచి వ‌దులూ ఉంటుంది. ఈ ప‌దార్థం మిగ‌తా శ‌రీర‌మంతా బ‌య‌ట‌కు రాగానే మ‌న‌కు క‌నిపించ‌కుండానే రాలిపోతుంది. కానీ, త‌ల‌పై వెంట్రుక‌ల కార‌ణంగా అక్క‌డే పేరుకుపోతుంది. పెచ్చులుగా మారిపోయి చుండ్రు త‌యార‌వుతుంది. త‌ల‌స్నానం రెగ్యుల‌ర్‌గా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. క‌నీసం రోజు విడిచి రోజు శుభ్రంగా త‌ల‌స్నానం చేస్తే ఈ స‌మ‌స్య ఉండ‌దు.

షాంపూలు, ర‌క‌ర‌కాల జెల్స్ వాడ‌టం వ‌ల్ల కూడా చుండ్రు స‌మ‌స్య వ‌స్తుంది. వీటిల్లో ఉండే కెమిక‌ల్స్ చ‌ర్మంపై పొర‌ను పాడు చేసి చుండ్రు త‌యార‌య్యేలా చేస్తాయి. కానీ, శాంపూ పెట్టుకున్న రోజు మ‌న వెంట్రుక‌లు బాగా క‌నిపిస్తాయి కాబ‌ట్టి మ‌నం శాంపూలు ఎక్కువ‌గా పెడుతుంటాం. కానీ, శాంపూలు త‌ర్వాత అస‌లు స‌మ‌స్య‌కు కార‌ణ‌మ‌వుతాయి. మ‌ళ్లీ చుండ్రును తగ్గించుకోవ‌డానికి శాంపూల‌పైనే ఆధార‌ప‌డ‌తాం.

శాంపూల‌ను ప‌క్క‌న‌పెట్టి కొన్ని చిన్న చిన్న చిట్కాల‌తో చుండ్రు స‌మ‌స్య‌ను త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. ముఖ్యంగా శాంపూల బ‌దులు వారానికి ఒక‌సారి కుంకుడు కాయ రసంతో త‌లంటుకోవాలి. ఒక‌వేళ చుండ్రు ఎక్కువ‌గా ఉండే త‌ల త‌డ‌ప‌క‌ముందే కుంకుడుకాయ ర‌సం త‌ల‌కు మ‌ర్ధ‌నా ఏసి 10 నిమిషాల పాటు ఉంచుకున్న త‌ర్వాత చ‌న్నీళ్ల‌తో స్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు చాలా వ‌ర‌కు త‌గ్గిపోతుంది.

చాలామంది నీళ్లు బాగా వేడి చేసుకొని స్నానం చేస్తుంటారు. ఇలా చేయ‌డం ద్వారా మ‌న ఇంట్లో క‌రెంటు లేదా గ్యాస్ వృధా కావ‌డంతో పాటు మ‌న త‌ల వెంట్రుక‌ల‌కు కూడా న‌ష్టం జ‌రుగుతుంది. చ‌న్నీటి స్నానమే ఆరోగ్యానికి, వెంట్రుక‌ల‌కు మంచిది. చుండ్రు స‌మ‌స్య ఉన్న వారు కూడా చ‌న్నీటి స్నానం చేయాలి. మ‌రీ చ‌న్నీళ్లు అయితే కొంచెం వేడి చేసుకుంటే ప‌ర్వాలేదు.

కొంద‌రికి కొబ్బ‌రి నూనె పెట్టుకుంటే చుండ్రు పెరుగుతుంద‌నే అపోహ ఉంటుంది. కానీ, ఇది త‌ప్పు. రోజూ త‌ల స్నానం చేసి కొబ్బ‌రి నూనె రాసుకుంటే చుండ్రు స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు జుట్టు బ‌లంగా మారుతుంది. నిమ్మ‌కాయ‌ను త‌ల‌పై రాసుకున్నా చుండ్రు స‌మ‌స్య అదుపులోకి వ‌స్తుంది. ఈ జాగ్ర‌త్తలు తీసుకుంటే ఏ శాంపూల‌తో అవ‌స‌రం లేకుండానే చుండ్రు త‌గ్గిపోతుంది.

Related News