logo

  BREAKING NEWS

అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |  

వేసవిలో చమట పట్టకుండా .. శరీరం నుంచి దుర్వాసన పోగొట్టే చిట్కాలు

ప్రతి మనిషి శరీరంలో సుమారు రెండు నుంచి నాలుగు మిలియన్ల స్వేద గ్రంథులు ఉంటాయి. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయినప్పుడు దాన్ని చల్లబరిచేందుకు చెమటలు వస్తుంటాయి. నిజానికి ఇది చాలా ఆరోగ్యకరమైన చర్య. కానీ అసలు సమస్యంతా చెమట వల్ల వచ్చే దుర్వాసనే. ఎండాకాలం వచ్చిందంటే అందరినీ ఇబ్బంది పెట్టె సమస్య ఉక్కపోత. చెమట. ఉక్క పోత పోవాలంటే కాసేపు చల్లటి వాతవరణంలో ఉంటె సరిపోతుంది.

కానీ శరీరం విడుదల చేసే చెమట వాసనను మాత్రం రాకుండా నివారించలేము. అలాగని బయట వేడి పెరిగితేనే చమట పడుతుంది అనుకోవడం సరికాదు. కొంత మందికి చల్లటి ప్రదేశంలో ఉన్నా చమట పట్టేస్తుంది. ఇది శరీర దుర్గంధాన్ని కారణమవుతుంది. అలసటగా ఉన్నా, ఒత్తిడికి గురైనా, ఉద్వేగపూరితమైన ఆలోచనల కారణంగా కూడా శరీరంలోని స్వేద గ్రంథులు తెరుచుకుని చెమటను ఉత్పత్తి చేస్తాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడేదెలాగో చూడండి.

వేసవిలో చెమట నుంచి, దుర్వాసన నుంచి బయటపడాలంటే పరిశుభ్రత పాటించడం ఒక్కటే మార్గం. రోజుకి రెండు సార్లైనా స్నానం చేయాలి. వారానికి రెండు సార్లు స్క్రబ్రర్ ను ఉపయోగించి శరీరంలోని చమట పట్టె భాగాలను శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వలన స్వేద గ్రంథులు శుభ్రపడతాయి. చెమట వచ్చినా దుర్వాసన కలగకుండా చేస్తాయి. స్నానం చేసిన తర్వాత చర్మానికి ఆస్ట్రినిజెంట్ లోషన్ ను రాసుకొనాలి. ఇది శరీరంపై ఉండే అతి సూక్ష్మమైన బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది. చర్మంలోకి ఇంకి పోయి చమట రాకుండా చేస్తుంది.

చెమటను ఎప్పటికప్పుడు పీల్చేసి శరీరాన్ని చల్లబరిచే దుస్తులను వేసుకోవాలి. న్యాచురల్ ఫైబర్ తో చేసిన దుస్తులు గాని, కాటన్ దుస్తులు గాని అందుకు అనువుగా అంటాయి. చెమట ఎక్కువగా వచ్చే శరీర భాగాల్లో టీ ట్రీ ఆయిల్ తో శుభ్రం చేసుకోవాలి. టాల్కమ్ పౌడర్ ను కూడా ఉపయోగించవచ్చు. స్నానం చేసేటప్పుడు నిమ్మ తొక్కతో చెమట పట్టె భాగాలను శుభ్రం చేసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. లేదంటే స్నానానికో ప్రయోగించే నీటిలో రోజ్ వాటర్ ను వేసి స్నానం చేస్తే సువాసన వెదజల్లుతుంది. ఇక ఆహరం విషయానికొస్తే అతిగా చమటలు పెట్టె వారు అల్లం, ఉల్లిపాయలు, పొగాకును తగ్గించాలి. ఎక్కువగా నీరు తాగడం, తాజా పండ్లు, కూరగాయలు, పళ్ళ రసాలు, గోధుమలతో చేసిన వంటకాలు చెమటను రాకుండా చేస్తాయి.

Related News