logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఈ చిన్న చిట్కాల‌తో న‌డుము నొప్పిని క్ష‌ణాల్లో త‌గ్గించుకోవ‌చ్చు

వ‌య‌స్సుతో సంబంధం లేకుండా ఈ మ‌ధ్య ఎక్కువ మందిని వేధించే స‌మ‌స్య‌గా మారింది న‌డుము నొప్పి. పెద్ద వ‌య‌స్సు వారికి న‌డుము నొప్పి అంటే ఏమైనా అర్థం ఉంటుంది కానీ 25 – 30 ఏళ్ల వారికి కూడా న‌డుము నొప్పి ఇబ్బంది పెట్ట‌డం మ‌నం చూస్తుంటాం. 90 శాతం మంది త‌మ జీవితంలో ఎప్పుడో అప్పుడు న‌డుము నొప్పితో బాధ‌ప‌డ‌తార‌ని అంచ‌నాలు ఉన్నాయి. న‌డుము నొప్పికి త‌ర‌చూ పెయిన్ కిల్ల‌ర్ ట్యాబ్లెట్లు వాడటం, బామ్‌లు రాసుకోవ‌డం ద్వారా చాలా మంది ఉప‌శ‌మ‌నం పొందుతుంటారు. కానీ, వీటి వ‌ల్ల టెంప‌ర‌రీగా న‌డుము నొప్పి స‌మ‌స్య కొంచెం త‌గ్గుతుంది. కానీ, పూర్తిగా ఈ స‌మ‌స్య దూరం కాదు.

ఎక్కువ‌గా కంప్యూట‌ర్ల ముందు వంగి కూర్చొని ప‌ని చేసే వారికి, తిన్న‌గా కూర్చోకుండా ప‌ని చేసే వారికి, టూవీల‌ర్ లేదా మ‌రేదైనా వాహ‌నంపై ఎక్కువ‌గా గ‌తుకుల రోడ్ల‌పై ప్ర‌యాణం చేసే వారికి, మెత్త‌టి ప‌రుపుల మీద ప‌డుకునే వారికి న‌డుము నొప్పి ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. అయితే, న‌డుము నొప్పి ఉన్న‌ప్పుడు పెయిన్ కిల్ల‌ర్‌, బామ్‌ల‌తో తాత్కాలిక ఉప‌శ‌మ‌నం పొందడానికి అల‌వాటు ప‌డ‌కుండా పూర్తిగా న‌డుం నొప్పిని శాశ్వ‌తంగా ఎలా త‌గ్గించుకొవాల‌నేది తెలుసుకొని కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

న‌డుము నొప్పి ఎక్కువ‌గా వెన్నెముక డిస్క్ స‌మ‌స్య‌ల వ‌ల్ల వ‌స్తుంటుంది. మ‌న వెన్ను మొత్తం వెన్నుపూస‌లు ఒక‌దాని మీద ఒక‌టి ఉంటాయి. వీటి మ‌ధ్య‌లో మెత్త‌టి డిస్క్‌లు ఉంటాయి. వెన్నుపూస‌ల‌పై ఒత్తిడి ప‌డ‌కుండా ఈ డిస్క్‌లు కాపాడుతుంటాయి. ఒక‌వేళ ఈ డిస్క్‌లు ఒత్తిడికి గురైతే న‌డుము నొప్పి మొద‌ల‌వుతుంది. స‌రిగ్గా కూర్చోకుండా ప‌ని చేసే వారికి డిస్క్‌ల‌పై ఒత్తిడి పెరిగి నడుం నొప్పి వ‌స్తుంటుంది. న‌డుము కండ‌రాల‌పై ఒత్తిడి పెరిగిన‌ప్పుడు కూడా న‌డుము నొప్పి వ‌స్తుంది.

మొత్త‌టి ప‌రుపుల మీద ఎక్కువ‌గా ప‌డుకునే వారికి ఎక్కువ‌గా న‌డుము నొప్పి స‌మ‌స్య‌లు ఉంటాయి. న‌డుము నొప్పి లేని వారు రెండు రోజులు మెత్త‌టి ప‌రుపుపై ప‌డుకుంటే నొప్పి మొద‌లుకావ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. కాబ‌ట్టి, మెత్త‌టి స్పాంజ్ ప‌రుపుల బ‌దులు బొంత‌లు లేదా స‌న్న‌టి దూది ప‌రుపుల్లో ప‌డుకోవ‌డం వ‌ల్ల న‌డుము నొప్పిని దూరం చేసుకోవ‌చ్చు.

న‌డుము నొప్పి ఎక్కువ‌గా ఉంటే న‌డుముపై నూనె రాసుకొని కాప‌డం పెట్టుకుంటే త‌గ్గిపోతుంది. ఆఫీసుల్లో, ఇంకెక్క‌డైనా వంక‌ర‌గా, వంగి కూర్చోకుండా నిటారుగా కూర్చుంటే న‌డుం నొప్పి రాదు. అధిక బ‌రువు కూడా న‌డుం నొప్పికి ప్ర‌ధాన కార‌ణం. కాబ‌ట్టి, అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం మంచిది. అస‌లు వ్యాయామం చేయ‌ని వారికి కూడా న‌డుము నొప్పి ఎక్కువ‌గా వ‌స్తుంది. వాకింగ్ లేదా జాగింగ్ క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే న‌డుము నొప్పి రాదు.

Related News