logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

వాతం నొప్పులు తగ్గించే అద్భుతమైన చిట్కా

కీళ్ల దగ్గర నొప్పులు రావడం, కీళ్లపై ఉన్న చర్మంపై ఎర్రగా కందినట్టుగా మారడం, కీళ్లు బిగుతుగా మారి నొప్పి కలగడం, కాళ్ళు, చేతులు వంకర్లు పోవడం లాంటివన్నీ కూడా కీళ్ల వాతానికి సంబందించిన లక్షణాలే. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ నొప్పులు అధికంగా బాధిస్తాయి. అలాగే చల్లటి వాతావరణంలో కూడా వీరు ఇబ్బందులు ఎదుర్కుంటారు. వాతానికి సంబందించిన నొప్పుల్లో చాలా రకాలు ఉంటాయి.

వాతం కలిగించే ఆహార పదార్థాలు తినడం, అరుగుదల సరిగ్గా లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి లాంటివన్నీ కీళ్ల వాతాన్ని కలిగిస్తాయి. ఈ సమస్యలు తొలి దశలో గుర్తించడం కష్టం. వైద్య పరీక్షల్లో సైతం అంతా మామూలుగానే కనిపిస్తుంది. కానీ ఈ పరిస్థితిని చికిత్స చేయకుండా వదిలేస్తే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. విపరీతమైన జ్వరం, నీరసం, నిస్సత్తువ, రక్తహీనత, బరువు తగ్గడం, చర్మంపై పుండ్లు పడటం, నరాలు చచ్చుబడి పోవడం, కంటి చూపు తగ్గడం, ఊపిరితిత్తులు పాడవటం ఇలా అనేక ప్రమాదకర వ్యాధులు వస్తాయి. ఇక చివరి దశలో కీళ్ల వాతం అనే సమస్య గుండె, మెదడు, బీపీ, షుగర్ కు సంబందించిన వ్యాధులు కలుగజేయడమే కాకుండా రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఏ వయసు వారిలోనైనా కీళ్ల వాతం సమస్య రావచ్చు. స్త్రీలలో అయితే ఈ సమస్య 30 సంవత్సరాల నుంచే కనిపిస్తుంది. ఈ కీళ్ల వాతం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ముందుగా జీర్ణ శక్తిని కాపాడుకోవాలి. తేలికగా అరిగే ఆహారాన్ని మాత్రమే తినాలి, చింతపండు, శనగ పిండి, బఠాణి లాంటి అరగడం కష్టంగా ఉండటమే కాకండా వాతాన్ని కూడా పెంచుతాయి. తేలికగా అరిగే తాజా పండ్లు, కూరగాయలు లాంటి ఆహారం మాత్రమే ఈ నొప్పులను తగ్గించగలవు. ఎవరిలో అయితే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు అవసరమైన జఠరాగ్ని తక్కువగా విడుదలవుతుందో వారికి వాతం నొప్పులు పిలవకుండానే వస్తాయి.

ఈ సమస్య ఉన్నవారు ఆహారంలో ధనియాలు, జీలకర్ర, శొంఠి, దాల్చినచెక్క, వాము, వెలుల్లి, ఆవాలు, మెంతులు, నువ్వులను ఎక్కువగా తీసుకోవాలి, ఇవి జీర్ణ శక్తిని పెంచుతాయి. బంగాళా దుంప లాంటి దుంప జాతికి చెందినవి, పులుపు ఎక్కువగా ఉండే కూరలు, ముదిరిపోయిన కాయగూరలు తీసుకోకూడదు. దాల్చిన చెక్క వాతం నొప్పులకు చక్కగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క, యాలకులు, శొంఠి, లవంగాలను మరిగించి అందులో కాస్త తేనె కలుపుకుని తీసుకుంటే వాతం తగ్గుతుంది. త్రిఫలా చూర్ణాన్ని 2 నుంచి 5 గ్రాముల వరకు పాలతో కలిపి తీసుకోవచ్చు. కీళ్ల వాతాన్ని తగ్గించడంలో వ్యాయామం చాలా ఉపయోగపడుతుంది. కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. కాబట్టి రోజులో అరగంట సేపు నడక వ్యాయామం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.

 

Related News
%d bloggers like this: