logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి

కోట్లాది హిందువుల చిర‌కాల స్వ‌ప్నం అయిన అయోధ్య రామ‌మందిర నిర్మాణం ప్రారంభ‌మైంది. ఇటీవ‌లే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రామ‌మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. అయోధ్య‌లో భ‌వ్య రామ‌మందిర నిర్మాణానికి దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాల నుంచి మ‌ట్టిని సేక‌రించారు. 151 న‌దుల నుంచి ప‌విత్ర జ‌లాల‌ను తీసుకెళ్లారు. ఇది ఒక ప‌విత్ర కార్యం. అయితే, మ‌న దేశంతో పాటు ప్ర‌స్తుతం పాకిస్తాన్ ఆక్ర‌మణ‌లో ఉన్న క‌శ్మీర్‌లోని ఓ ఆల‌యం నుంచి కూడా ప‌విత్ర మ‌ట్టి అయోధ్య రామ మందిరానికి వ‌చ్చింది. రామ మందిర నిర్మాణానికి పీఓకే నుంచి మ‌ట్టి రావ‌డం వెనుక ఆస‌క్తిక‌ర క‌థ ఉంది. ఆ క‌థ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పురాణాల్లోకి వెళ్తే.. స‌తీదేవి శ‌రీరాన్ని ప‌ట్టుకొని ప‌ర‌మ‌శివుడు ఆగ్ర‌హంతో శివ‌తాండవం చేస్తుంటాడు. ఆయ‌న‌ను ఆప‌డానికి మ‌హా విష్ణువు సుద‌ర్శ‌న చ‌క్రాన్ని ఉప‌యోగిస్తాడు. సుద‌ర్శ‌న చ‌క్రం త‌గిలి స‌తీదేవి శ‌రీరం 18 ముక్క‌లు అయ్యి వివిధ ప్రాంతాల్లో ప‌డ‌తాయి. శ‌రీర భాగాలు ప‌డిన 18 ప్రాంతాలు హిందువుల‌కు ఎంతో పవిత్ర‌మైనవి. వీటినే మ‌నం అష్టాద‌శ శ‌క్తి పీఠాలుగా పిలుస్తుంటాం. ఈ 18 శ‌క్తి పీఠాల్లో ఒక‌టి ప్ర‌స్తుతం పాకిస్తాన్ ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న క‌శ్మీర్‌లో ఉంది. ఈ ఆల‌యం పేరు శార‌దాపీఠం.

పాకిస్తాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీఓకే) రాజ‌ధాని ముజ‌ఫ‌రాబాద్‌కు ఉత్త‌రం వైపు 207 కిలోమీట‌ర్ల దూరంలో శార‌దాపీఠం ఉంటుంది. దేశ విభ‌జ‌న‌కు ముందు ఈ ఆల‌యం నిత్యం భ‌క్తుల‌తో క‌ళ‌క‌ళ‌లాడేది. ప్ర‌త్యేకించి క‌శ్మీర్ పండిట్ల‌కు శార‌దాపీఠం చాలా ప‌విత్రం. త‌ర‌చూ వెళ్లి వ‌చ్చే వారు. దేశవిభ‌జ‌న జ‌రిగిన తర్వాత పాకిస్తాన్ దుష్ట‌ప‌న్నాగంతో క‌శ్మీర్‌లోని కొంత ప్రాంతాన్ని ఆక్ర‌మించిన త‌ర్వాత శార‌దాపీఠం పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోకి వెళ్లిపోయింది. దీంతో భార‌త్‌తో ఈ ప్రాంతానికి సంబంధాలు తెగిపోయాయి.

చివ‌ర‌కు స్వామి నంద్ లాల్ అనే ఓ క‌శ్మీరి సాధువు ఈ ఆల‌యాన్ని ద‌ర్శించారు. ఆయ‌న‌కు అక్క‌డే ఆశ్ర‌మం కూడా ఉండేది. విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న ఆశ్ర‌మాన్ని శార‌దా నుంచి క‌శ్మీర్‌లోని టిక్కర్ అనే గ్రామానికి మ‌ర్చారు. పాక్ ఆక్ర‌మ‌ణ‌లోకి క‌శ్మీర్‌లోని కొంత భాగం వెళ్లిపోయాక భార‌తీయులు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్ట‌కుండా పాకిస్తాన్ అడ్డుకుంది. దీంతో క‌శ్మీరి పండిట్లు కూడా త‌మ ఇష్ట‌దైవం ఆల‌యానికి వెళ్ల‌లేక‌పోయారు. అప్ప‌టినుంచి ఈ ఆల‌యం కూడా పూర్తిగా శిథిలావ‌స్థ‌లోకి చేరిపోతోంది.

అయితే, క‌శ్మీర్ పండిట్ల‌కు మాత్రం మ‌ళ్లీ శార‌దాపీఠాన్ని ద‌ర్శించాల‌నేది చిర‌కాల కోరిక‌. ఇది వారికి సెంటిమెంట్ లాంటిది. అయోధ్య‌లో భూమి పూజ‌కు 18 శ‌క్తి పీఠాల నుంచి ప‌విత్ర మ‌ట్టిని తీసుకురావాల‌ని అనుకున్న‌ప్పుడు పీఓకేలోని శార‌దాపీఠం నుంచి మ‌ట్టిని ఎలా తీసుకురావాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. అయోధ్య రామాల‌య నిర్మాణం చేప‌డుతున్న ట్ర‌స్ట్ ఇందుకోసం విశ్వ హిందూ ప‌రిష‌త్‌ను సంప్ర‌దించింది. శార‌దా పీఠం నుంచి మ‌ట్టిని తెచ్చే బాధ్య‌త‌ను సేవ్ శార‌దా క‌మిటీకి వీహెచ్‌పీ అప్ప‌గించింది.

శార‌దాపీఠం నుంచి ప‌విత్ర మ‌ట్టిని తీసుకువ‌చ్చేందుకు సేవ్ శార‌దా క‌మిటీ చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించింది. భార‌తీయులు ఎవ‌రూ అక్క‌డ‌కు వెళ్ల‌లేరు. క‌ర్ణాట‌క‌కు చెందిన భ‌ర‌త్‌వంశీ వెంక‌టేష్ రామ‌న్‌, ఆయ‌న భార్య చైనాలో నివ‌సిస్తున్నారు. వీరికి చైనా పాస్‌పోర్టు కూడా ఉంది. శార‌దా క‌మిటీ వీరిని సంప్ర‌దించ‌గా వారు ధైర్యం చేసి శార‌దా పీఠానికి వెళ్లి మ‌ట్టిని తీసుకువ‌చ్చేందుకు ముందుకొచ్చారు. చైనా పాస్‌పోర్టుపై హాంగ్ కాంగ్ నుంచి పీఓకే రాజ‌ధాని ముజ‌ఫ‌రాబాద్ వెళ్లారు. అక్క‌డి నుంచి శార‌దాపీఠానికి వెళ్లి ప‌విత్ర మ‌ట్టిని తీసుకొని మ‌ళ్లీ హాంగ్ కాంగ్ మీదుగా ఢిల్లీ వ‌చ్చారు. అయోధ్య రామ‌మందిర భూమి పూజ‌కు 10 రోజుల ముందే శార‌దాపీఠం మ‌ట్టిని అయోధ్య‌కు చేర్చారు. త‌మకు ఎంతో ప‌విత్ర‌మైన శార‌దాపీఠం నుంచి మ‌ట్టిని కూడా అయోధ్య రామ‌మందిర భూమి పూజ‌కు తీసుకురావ‌డంతో క‌శ్మీర్ పండిట్లు కూడా సంతోషంగా ఉన్నారు.

Related News