logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!

హైద్రాబాదు పాత బస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి సంజయ్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఓ లేఖ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గ్రేటర్ పరిధిలో వరద బాధితులకు పది వేల సాయం నిలిపివేయువాలంటూ తన పేరుతో ఉన్న లేఖపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు.

ఈసీకి ఆ లేఖ తాను రాసింది కాదని.. తమను దొంగదెబ్బ తీయడానికి కేసీఆర్ ఆడుతున్న నాటకంలో భాగమే ఇదంతా అంటూ మండిపడ్డారు. అయితే కేసీఆర్ నిజంగా హిందువైతే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేసి ఈ విషయాన్నీ ఒప్పుకోవాలని కేసీఆర్ కు సవాలు విసిరారు. ఆ లేఖపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు.

ఈరోజు మధ్యాహ్నం తాము భాగ్య లక్ష్మి అమ్మవారి ఆలయానికి వస్తామని కేసీఆర్ కూడా రావాలని సవాల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి చార్మినార్ అమ్మవారి ఆలయం వరకు బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందు ఈ ర్యాలీకి అనుమతులు ఇవ్వని పోలీసులు ఆ తర్వాత అనుమతించినట్టు తెలుస్తుంది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే మాత్రం కేసులు పెడతామని సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.

అయితే అసలే ఈరోజు శుక్రవారం కావడంతో ఈ ర్యాలీలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. సౌత్ జోన్ సీసీపై భూపాల్ నేతృత్వంలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. చార్మినార్, మదీనా గూడ, గుల్జార్ హౌస్, శాలిబండ, హుస్సేన్ యాలం,, మీరు చౌక్, ఫలక్నామ, ముర్గీ చౌక్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దింపారు. కాగా ఏ క్షణమైనా బండి సంజయ్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది.

Related News