logo

  BREAKING NEWS

అన్న‌మ‌య్య జిల్లా పూర్తి వివ‌రాలు  |   తూర్పు గోదావ‌రి(రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) జిల్లా పూర్తి వివ‌రాలు  |   ఎన్‌టీఆర్ కృష్ణా జిల్లా పూర్తి వివ‌రాలు  |   శ్రీబాలాజీ తిరుప‌తి జిల్లా పూర్తి వివ‌రాలు  |   ఎంపీ ప‌ద‌విపై క‌న్నేసిన రాజాసింగ్‌.. అక్క‌డి నుంచి పోటీ  |   షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |  

హైదరాబాద్ లోని హబ్సిగూడకు ఆ పేరెలా వచ్చింది? బానిసలుగా వచ్చిన ఆఫ్రికన్లు బాద్షాలుగా ఎలా మారారు?

హైద్రాబాద్ లో కొన్ని ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆ ప్రాంతాల పేర్లు కొన్ని ప్రముఖంగా వినిపిస్తుంటాయి. కొన్ని పేర్లకు అర్థం ఏమిటో కూడా మనకు తెలియదు. అలాంటి ఒక ప్రాంతమే నగరంలోని హబ్సిగూడ. ఈ ప్రాంతంలో నివసించేవారు చాలా మంది ధనిక వర్గాలకు చెందిన వారే ఉంటారు. హబ్సిగూడకు ఆ పేరెలా వచ్చిందో అనే విషయం చాలా మందికి ఒక సందేహం. అయితే హబ్సిగూడ ప్రాంతానికి ఉన్న చరిత్రను పరిశీలిస్తే చాలా పెద్ద కథే ఉంది.

ఈ ప్రాంతాం పై ఆఫ్రికన్ల ముద్ర బలంగా ఉండేదని చరిత్ర చెప్తుంది. ఆఫ్రికా దేశానికి భారత్ కు మధ్యన సంబంధాలు కొన్ని శతాబ్దాల క్రితం నుంచే కొనసాగుతున్నాయి. ఆ సమయంలో భారత్ కు చాలా మంది ఆఫ్రికన్లు వలస వచ్చారు. ఆఫ్రికాలోని ఈశాన్య ప్రాంతానికి చెందిన ప్రజలను హబ్సి లుగా పిలిచేవారు. వారు ఆఫ్రికా నుంచి ఇక్కడి పాలకుల దగ్గర బానిసలుగా, పశువుల కాపర్లుగా వచ్చేవారు. అలా వచ్చినవారంతా హబ్సిగూడ ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకుని స్థిరపడ్డారు. భారత్ లో అనుకోకుండా జరిగిన కొన్ని దురాక్రమణలు, యుద్ధాల్లో అనుకోకుండా వీరు కీలక పాత్ర పోషించారు. ఆనాటి నుంచి వివిధ ప్రాంతాల్లోని రాజులకు ద్వార పాలకులు, సైనికులుగా, అంగరక్షకులుగా కూడా హబ్సిలు పనిచేయడం మొదలైంది.

గోల్కొండ సుల్తానుల కాలంలో కూడా హబ్సిలకు వారి అంగరక్ష పరివాహంలో చోటు కల్పించారు. అలా ప్రధానమైన కార్యకలాపాల్లో వీరికి ప్రాధాన్యం పెరిగింది. వారిలో కొందరు తమ తెలివి తేటలు, ధైర్య సాహసాలతో ఇక్కడి ప్రాంతాలలో పలుకుబడిని పెంచుకున్నట్టుగా చరిత్ర చెప్తుంది. అలాంటి వారిలో మాలిక్ అంబర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అహ్మద్ నగర్ ను ఏలిన ఈయన మొఘల్ చక్రవర్తులను ఎదురించి ధీశాలిగా పేరు పొందాడు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతం కూడా 1678 నుంచి పదేళ్ల పాటు ఆఫ్రికన్ అయిన సీదీ మసూద్ అనే వ్యక్తి పాలనలో ఉండేది. నాలుగో శతాబ్దంలో భారత్ కు వీరి వలసలు మొదలయ్యాయి. ఆ తర్వాత 14, 17 శతాబ్దాల మధ్య వీరి ప్రాబల్యాన్ని బాగా పెంచుకున్నారు. ఆఫ్రికా సంప్రదాయాన్ని, సూఫీ సంగీతాన్ని ఇక్కడి వారికి పరిచయం చేసారు.

శతాబ్దాలుగా ఇక్కడ నివసిస్తుండటంతో వారంతా ఇప్పుడు హైదరాబాదీలయ్యారు. ఈ విధంగా బానిసలుగా మన దేశానికి వచ్చిన ఆఫ్రికన్ హబ్సి లు హైదరాబాద్ లో బాద్ షా లుగా మారిపోయారు. వారి పేరు మీదుగానే ఈ ప్రాంతం హబ్సిగూడగా మారిందని చెప్తారు. ఇప్పటికీ ఆనాటి హబ్సి ల వారసులు ఈ ప్రాంతంలో కనిపిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా హబ్సీల మూలాలు కనిపిస్తాయి.

 

 

Related News