logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

నెర‌వేరుతున్న పాక్ హిందువుల క‌ల‌.. భారీ ఆల‌య నిర్మాణం

1947కు ముందు భార‌త‌దేశంలో అంత‌ర్భాగంగా ఉండే పాకిస్తాన్‌లో హిందూ మ‌తం దేదీప్య‌మానంగా వెలిగింది. ఇప్ప‌టి పాకిస్తాన్ ప్రాంతంలో కూడా అనేక ప్ర‌ముఖ హిందూ దేవాల‌యాలు ఉండేవి. ఈ ఆల‌యాల్లో నిత్యం పూజా కైంక‌ర్యాలు జ‌రిగేవి. హిందువుల జ‌నాభా కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉండేది. వీరంతా స్వేచ్ఛ‌గా హిందూ ఆల‌యాల్లో త‌మ ఇష్ట‌దైవాలకు పూజ‌లు చేసుకునే వారు. భ‌క్తుల రాక‌పోక‌లు, పూజ‌ల‌తో పాకిస్తాన్ ప్రాంతంలోని హిందూ ఆల‌యాలు నిత్య‌శోభ‌తో వెలిగిపోయేవి. అయితే, దేశ విభ‌జ‌న‌తో ఈ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది.

1947లో మ‌త ప్రాతిపాదిక‌న దేశ విభ‌జ‌న జ‌రిగి ముస్లింల కోసం పాకిస్తాన్ ప్ర‌త్యేక దేశంగా ఏర్ప‌డింది. అప్పటివ‌ర‌కు పాకిస్తాన్ ప్రాంతంలో నివ‌సించిన హిందువులు చాలామంది భార‌త‌దేశానికి వ‌చ్చేశారు. భార‌త్ నుంచి అనేక మంది ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లి స్థిర‌ప‌డ్డారు. ఈ స‌మ‌యంలో పెద్ద ఎత్తున మ‌త ఘ‌ర్ష‌ణలు జ‌రిగాయి. పాకిస్తాన్ ప్రాంతంలోని హిందూ ఆల‌యాల విద్వంసం జ‌రిగింది. దీంతో అప్ప‌టివ‌ర‌కు భ‌క్తుల‌తో నిత్యం క‌ళ‌క‌ళ‌లాడిన పాకిస్తాన్‌లోని హిందూ ఆల‌యాలు దేశ విభ‌జ‌న త‌ర్వాత మూగ‌బోయాయి.

దేశ విభ‌జ‌న త‌ర్వాత పాకిస్తాన్‌లో హిందువులు మైనారిటీలుగా మారిపోయారు. చాలా మంది భార‌త్‌కు వ‌ల‌స వ‌చ్చేయ‌గా మాతృభూమిని విడిచి రాలేక కొంద‌రు అక్క‌డే స్థిర‌ప‌డిపోయారు. కానీ, మైనారిటీలైన హిందువుల‌కు అక్క‌డ స్వేచ్ఛ లేదు. ఇప్ప‌టికీ హిందువుల‌పై దాడులు జ‌రుగుతున్న వార్త‌లు వ‌స్తుంటాయి. హిందూ ఆల‌యాల నిర్వ‌హ‌ణ కూడా లోపించి ఒక‌ప్పుడు ఎంతో ప్ర‌ముఖ ఆల‌యాలుగా పేరొందిన‌వి ఇప్పుడు శిథిలావ‌స్థ‌కు చేరాయి. ఇటువంటి స‌మ‌యంలో పాకిస్తాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్‌లో హిందువుల కోసం భార‌త్ ఆల‌యాన్ని నిర్మిస్తోంది పాకిస్తాన్ ప్ర‌భుత్వం.

ఇస్లామాబాద్ జ‌నాభాలో హిందువులు 4 శాతం వ‌ర‌కు ఉంటారు. గ‌త 20 ఏళ్లుగా న‌గ‌రంలో హిందువుల జ‌నాభా పెరుగుతోంది. కానీ, పూజ‌లు చేసుకోవ‌డానికి ఇస్లామాబాద్ న‌గ‌రంలో ఒక్క హిందూ ఆల‌యం కూడా లేదు. నిజానికి 1947కు ముందు ఇస్లామాబాద్‌లో, చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో చాలా ఆల‌యాలు ఉండేవ‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. కానీ, కాల‌క్ర‌మంలో అవ‌న్నీ దాడుల‌కు గురి కావ‌డం, శిథిలావ‌స్థ‌కు చేర‌డంతో ఇప్పుడు క‌నుమ‌రుగ‌య్యాయి. దీంతో ఇప్పుడు ఇస్లామాబాద్‌లోని హిందువులు పూజ‌లు చేసుకునే అవ‌కాశం కూడా లేకుండా పోయింది.

మైనారిటీలైన త‌మ‌కు పూజ‌లు చేసుకునేందుకు ఇస్లామాబాద్‌లో ఒక ఆల‌యం నిర్మించాల‌ని అక్క‌డి హిందువులు చాలా కాలంగా ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. వీరి మొర‌ను ఎట్ట‌కేల‌కు ఆల‌కించిన పాకిస్తాన్ ప్ర‌భుత్వం ఆల‌య నిర్మాణానికి అంగీక‌రించింది. 2017లో ఇస్లామాబాద్ హిందూ పంచాయ‌త్‌కు క్యాపిట‌ల్ డెవెల‌ప్‌మెంట్ అథారిటీ(సీడీఏ) ఆల‌య నిర్మాణానికి భూమిని కేటాయించింది. అయితే, నిర్మాణ ప‌నులు మాత్రం మూడేళ్లుగా పెండింగ్‌లో ప‌డిపోయాయి.

ఇప్పుడు ఎట్ట‌కేల‌కు హిందూ ఆల‌యానికి మోక్షం క‌లిగింది. జూన్ 24న ఆల‌య నిర్మాణానికి అక్క‌డి మ‌త వ్య‌వ‌హారాల మంత్రి పిర్ నూరుల్ హ‌క్ ఖాద్రీ, హ్యుమ‌న్ రైట్స్ పార్ల‌మెంటరీ సెక్రెట‌రీ లాల్ చంద్ మ‌ల్హి ఆల‌య నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఇస్లామాబాద్‌లోని హెచ్‌-9 ప్రాంతంలో 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఆల‌య నిర్మాణం జ‌ర‌గ‌నుంది. శ్రీ కృష్ణ మందిర్‌గా ఈ ఆల‌యానికి హిందూ పంచాయ‌త్ పేరు పెట్టింది. ఆల‌య నిర్మాణానికి కావాల్సిన రూ.10 కోట్ల‌ను ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం భ‌రించేందుకు నిర్ణ‌యించింది. మొత్తంగా ఈ ఆల‌య నిర్మాణంతో ఇన్నాళ్లు ఇస్లామాబాద్ హిందువుల క‌ల‌లు నెర‌వేర‌నున్నాయి.

Related News