logo

  BREAKING NEWS

క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |   క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |  

IPL 2020: ఎక్కువ డ‌బ్బులు సంపాదించే టాప్ 10 క్రికెట‌ర్స్ వీళ్లే

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ పండుగ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ప్రారంభ‌మైంది. ఈసారి క‌రోనా వైర‌స్ కార‌ణంగా మ‌న దేశంలో కాకుండా దుబాయ్‌లో ఐపీఎల్ జ‌రుగుతోంది. మొద‌టిసారిగా ప్రేక్ష‌కులు లేకుండా క్లోస్డ్ డోర్ ప‌ద్ధ‌తిలో మ్యాచ్‌లు జ‌ర‌గనున్నాయి. ఐపీఎల్ అంటే అన్ని దేశాల క్రికెట్ అభిమానుల్లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది. అందుకే ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్ల‌పై కాసుల‌వ‌ర్షం కురుస్తుంది. ఒక్కో క్రికెట‌ర్ ఐపీఎల్‌కు కోట్ల‌లో సంపాదిస్తున్నారు. 2020 ఐపీఎల్‌కు సంబంధించి ఎక్కువ‌గా డ‌బ్బులు తీసుకుంటున్న క్రికెటర్లు ఎవ‌రో మీరు ఓ లుక్కేయండి.

10. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌
ఆస్ట్రేలియాకు చెందిన ఈ విధ్వంస‌ర బ్యాట్స్‌మెన్ ఐపీఎల్‌లో ప్ర‌తీసారి స‌త్తా చాటుతున్నాడు. త‌క్కువ బాల్స్‌లో బౌండ‌రీల‌తో విరుచుకుప‌డి ఎక్కువ ప‌రుగులు చేస్తున్నాడు. అందుకే మ్యాక్స్‌వెల్‌కు ఏకంగా రూ.10.75 కోట్లు చెల్లిస్తోంది కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ జ‌ట్టు.

9. హార్ధిక్ పాండ్యా
భార‌త్‌కు చెందిన ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా క్రికెట్‌లోకి అడుగుపెట్టి కొన్ని రోజులే అవుతున్నా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. దీంతో 26 ఏళ్ల ఈ క్రికెట‌ర్‌ను ముంబై ఏకంగా 11 కోట్ల‌కు ద‌క్కించుకుంది. 2019లో హార్ధిక్ 16 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 402 ప‌రుగులు చేశాడు. 14 వికెట్లు తీసుకున్నాడు.

8. ఎల్‌.రాహుల్‌
ఐపీఎల్‌లో ఎక్కువ సంపాదిస్తున్న క్రికెట‌ర్ల లిస్టులో భార‌త్‌కు చెందిన ఎల్‌.రాహుల్ 8వ స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్‌లో బాగా రాణించే రాహుల్‌కు కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ జ‌ట్టు ఐపీఎల్ 2020కి గానూ రూ.11 కోట్లు చెల్లిస్తోంది.

7. మ‌నీష్ పాండే
భార‌త్‌కే చెందిన బ్యాట్స్‌మెన్ మ‌నీష్ పాండే హ‌యెస్ట్ పెయిడ్ ఐపీఎల్ ప్లేయ‌ర్ల లిస్టులో 8వ స్థానంలో ఉన్నాడు. మ‌నీష్ పాండేకు మ‌న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు రూ.11 కోట్లు చెల్లిస్తోంది. హైద‌రాబాద్ జ‌ట్టు బ్యాటింగ్ బ‌లంలో మ‌నీష్ పాండే కీల‌కంగా ఉంటాడు.

6. ఏబీ డివిలియ‌ర్స్‌
దేశాలు, జ‌ట్ల‌తో సంబంధం లేకుండా క్రికెట్ ప్రేక్ష‌కుల అభిమానం ఎక్కువ‌గా పొందే ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్‌. ద‌క్షిణాఫ్రికాకు చెందిన ఈ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ స్టైల్‌కు స‌ప‌రేట్ ఫ్యాన్‌బేస్ ఉంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున గ‌త కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో స‌త్తా చాటుతున్నాడు ఏబీ. ఈ ఐపీఎల్ సీజ‌న్‌కు గానూ బెంగ‌ళూరు టీమ్ డివిలియ‌ర్స్‌కు రూ.11 కోట్లు చెల్లిస్తోంది.

5. స్టీవ్ స్మిత్‌
ఐపీఎల్‌లో బెస్ట్ కెప్టెన్ ఎవ‌ర‌ని చూస్తే స్టీవ్ స్మిత్ క‌చ్చితంగా టాప్ 3లో ఉంటాడు. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ అద్భూత‌మైన ఆట‌గాడు. స్మిత్ కెప్టెన్‌గా ఆడిన మ్యాచ్‌ల్లో 65 శాతం గెలిపించాడంటేనే అత‌డు ధి బెస్ట్ కెప్టెన్ అనుకోవ‌చ్చు. స్మిత్‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ.12.5 కోట్లు చెల్లిస్తోంది.

4. డేవిడ్ వార్న‌ర్‌
హైద‌రాబాద్ జ‌ట్టుకు డేవిడ్ వార్న‌ర్ స‌గం బ‌లం. 2016 నుంచి మ‌న జ‌ట్టుకు ఎన్నో విజ‌యాలు అందిస్తున్నాడు. బ్యాటింగ్‌తో విరుచుకుప‌డే వార్న‌ర్ అంటే హైద‌రాబాద్ జ‌ట్టు అభిమానుల‌కు ఒక న‌మ్మ‌కం. వార్న‌ర్ ఉంటే చాలు అనేలా ఈ న‌మ్మ‌కం ఉంటుంది. వార్న‌ర్‌కు ఐపీఎల్ 2020కి గానూ రూ.12.5 కోట్లు చెల్లిస్తోంది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌.

3. రోహిత్ శ‌ర్మ‌
ఐపీఎల్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌ను చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే కెప్టెన్‌గా ముంబై ఇండియ‌న్స్ టీమ్‌ను నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిపించిన ఘ‌న‌త రోహ‌త్‌దే. బ్యాటింగ్‌లో అద్భుత‌మైన ప్ర‌తిభ క‌న‌బ‌రిచే రోహిత్ శ‌ర్మ‌కు ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఏడాదికి రూ.15 కోట్లు చెల్లిస్తోంది.

2. ఎంఎస్ ధోని
చెన్నైను ఐపీఎల్‌లో తిరుగులేని జ‌ట్టుకు నిలిపిన ఘ‌న‌త క‌చ్చితంగా ఎంఎస్ ధోనికే ద‌క్కుతుంది. కెప్టెన్సీలో ఎంఎస్ ధోనిని మించిన వారు లేరు. చెన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్టును మూడుసార్లు ఐపీఎల్ గెలిపించాడు ధోని. బ్యాట్స్‌మెన్‌గా, కీప‌ర్‌గా ధోని స‌త్తా గురించి అంద‌రికీ తెలిసిందే. ఈసారి ధోనికి రూ.15 కోట్లు చెల్లిస్తోంది చెన్నై సూప‌ర్‌కింగ్స్ టీమ్‌.

1. విరాట్ కోహ్లీ
ఐపీఎల్‌లో ఎక్కువ సంపాదిస్తున్న క్రికెట‌ర్ విరాట్ కోహ్లి. విరాట్ కోహ్లీకి స‌రిహ‌ద్దుల‌తో సంబంధం లేకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా హ‌ద్దులు లేని అభిమానులు ఉన్నారు. బ్యాటింగ్‌లో విరాట్‌ను మించిన వారు లేరు. అందుకే విరాట్ ఐపీఎల్‌లో హ‌యెస్ట్ పెయిడ్ క్రికెట‌ర్‌గా నెంబ‌ర్ 1 స్థానంలో ఉన్నాడు. ఆయ‌న‌కు బెంగ‌ళూరు జ‌ట్టు ఏకంగా రూ.17 కోట్లు చెల్లిస్తోంది.

Related News