logo

  BREAKING NEWS

శ‌భాష్‌ జ‌గ‌న్‌.. ఈ ఒక్క నిర్ణ‌యంతో మ‌రో మెట్టు ఎక్కేశావు  |   పెట్రోల్ పంపులో మ‌న‌కు ఇవ‌న్నీ ఉచితంగా ఇవ్వాల్సిందే  |   శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. 26-02-2021 బంగారం ధ‌ర‌లు  |   నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా ఫట్టా?  |   బ్రేకింగ్: ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా కేసులో యువతి ఆత్మహత్య!  |   కుప్పంలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. షాకివ్వనున్న కీలక నేతలు!  |   విద్యార్థులకు శుభవార్త : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ఆదేశాలు!  |   కుప్పం కోటలు బద్దలు కొట్టారు.. మంత్రిపై సీఎం జగన్ ప్రశంసలు!  |   హాలీవుడ్‌లోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంట్రీ..?  |   బంగారం కొనేందుకు బెస్ట్ టైమ్‌.. 23.02.2021 బంగారం ధ‌ర‌లు  |  

నిమ్మగడ్డకు హైకోర్టు షాక్.. రాష్ట్రపతి పర్యటనకు మంత్రి పెద్దిరెడ్డి!

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనలో పాల్గొనేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 21 వ తేదీ వరకు మంత్రి పెద్ది రెడ్డిని ఇంటి నుంచి బయటకు రానివ్వద్దంటూ ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రోటోకాల్ కారణంగా రాష్ట్రపతి పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొనాల్సి ఉంది. దీంతో ఈ పర్యటనలో మంత్రి పాల్గొంటారా? లేదా అనే విషయం ఉత్కంఠగా మారింది.

ఆదివారమే పర్యటన ఉండటంతో మంత్రి పెద్దిరెడ్డి ఈ విషయంపై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై ఈరోజు ఉదయం నుంచి హై కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనాల్సి ఉన్న విషయాన్ని మంత్రి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు కోర్టు అనుమతులు ఇచ్చింది.

ఈరోజు రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు మంత్రి వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధిస్తు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలను సస్పెండ్ చేయాలనీ మంత్రి తరపు న్యాయవాది కోర్టును కోరారు. కాగా ఈ అంశంపై తీర్పును మధ్యాహ్ననికి వాయిదా వేసింది కోర్టు.

Related News