కరోనా కొత్త స్ట్రెయిన్ కారణంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్న వేళ తెలంగాణలో బార్లు, పబ్బులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. మద్యం మత్తులో ఆక్సిడెంట్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష విధించనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
కొత్త కరోనా డేంజర్ అంటూనే రాష్ట్రంలో కొత్త సంవత్సరం వేడుకలను ఎందుకు బ్యాన్ చేయలేదని కోర్టు ప్రశ్నించింది. అర్థరాత్రి వరకు పబ్బులు, బార్లు విచ్చలవిడిగా తెరిచి ఉంచి ఏం చేయాలనుకుంటున్నారు అని కోర్టు మండిపడింది. మీడియాలో కథనాలు చూసి ఈ కేసును సుమోటోగా స్వీకరించింది హైకోర్టు. ఇప్పటికే రాజస్థాన్, మహారాష్ట్రలో న్యూ ఇయర్ వేడుకల్ని నిషేదించాయని కోర్టు వ్యాఖ్యానించింది.