logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

‘విరాట్ కోహ్లీ, తమన్నాను వెంటనే అరెస్టు చేయండి’

టీమ్ ఇండియా యువ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియాలను వేంటనే అరెస్టు చేయాలంటూ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. సూర్య ప్రకాష్ అనే న్యాయవాది మద్రాస్ హై కోర్టులో వీరిపై పిటిషన్ దాఖలు చేసాడు. సెలెబ్రిటీలైన వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా ఆన్ లైన్ బెట్టింగులు ప్రమోట్ చేస్తున్నారని.. ఈ యాప్ ఆ ద్వారా యువత వ్యసనాలకు బానిసవుతున్నారని పేర్కొన్నారు.

ఇటీవల ఓ యువకుడు ఈ ఆన్ లైన్ బెట్టింగుల వల్ల అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకు సంబందించిన వివరాలను న్యాయస్థానానికి అందజేశారు. బాధ్యతారాహిత్యంగా యువతను తప్పుడవ పట్టిస్తున్న వీరిద్దరిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలనని అరెస్టు చేయాలని కోర్టుకు విన్నవించారు.

ఈ పిటిషన్ ను స్వీకరించిన మద్రాస్ హై కోర్టు ఈ కేసు విచారణను మంగళవారం రోజుకి వాయిదా వేసింది. కాగా తమన్నా, కోహ్లీ మొబైల్ ప్రీమియర్ లీగ్(ఎంపిఎల్) అనే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారు. కాగా దీనిపై కోహ్లీ, తమన్నాలు ఇంకా స్పందించలేదు. మంగళవారం కోర్టు విచారణలో భాగంగా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.

Related News