logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

వామన్ రావు హత్య కేసు: ఘటనాస్థలంలో ఆర్టీసీ బస్సులు, సాక్ష్యులపై హైకోర్టు సంచలన ఆదేశాలు!

న్యాయవాద దంపతులు వామన్ రావు నాగమణి హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. న్యాయవాదుల హత్యపై హైకోర్టు దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ హత్యకు సంబందించిన అన్ని ఆధారాలను పకడ్బందీగా సేకరించాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలను కోర్టు పేర్కొంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన హై కోర్టు అన్ని ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను మార్చి 1లోపు అందించాలని ఆదేశించింది.

హత్య జరిగిన చోట అన్ని ఆధారాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించింది. ఈ ఘటన రాష్ట్ర ప్రతిష్టకు, న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకానికి సంబంధించినదిగా కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం కలగాలంటే ఈ కేసుకు సంబందించిన అన్ని అధరాలు సేకరించాలని పేర్కొంది. కాగా ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలాన్ని సాక్ష్యాధారాలను కూడా సేకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఘటన జరిగిన సమయంలో అక్కడ రెండు ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయని బస్సులో ఆర్టీసి సిబ్బందిని, ప్రయాణికులను విచారించి వారి ద్వారా సాక్ష్యాలను సేకరించాలని పేర్కొంది. సోషల్ మీడియాలో హత్యకు సంబందించిన దృశ్యాలు వైరల్ కాగా వాటిని కూడా వెరిఫై చేసి సాక్ష్యాలను భద్రపరచాలని తెలిపింది. ఈ కేసును రాష్ట్ర ప్రజల భద్రతకు సంబందించిన విషయంగా చూడాలని ఏజీకి హై కోర్టు సూచించింది. ఈ కేసుపై తదుపరి విచారణను మార్చి 1 కి వాయిదా వేసింది హై కోర్టు.

Related News