logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

వర్మ మర్డర్ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండిషన్!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘మర్డర్’ సినిమా విడుదలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలపై గతంలో నల్గొండ కోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాంగోపాల్ వర్మ హై కోర్టును ఆశ్రయించగా ఇప్పుడు మర్డర్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయి.

రెండేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యను ఆధారం చేసుకుని రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై ప్రణయ్ కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సినిమా విడుదలపై వారు నల్గొండ కోర్టును ఆశ్రయించారు.

తాజాగా హైకోర్టు ఈ కేసులో తీర్పునిస్తూ నల్గొండ కోర్టు ఇచ్చిన స్టేను కొట్టివేసింది. తాము తీసిన సినిమాకు ప్రణయ్, అమృతల కథకు ఎలాంటి సంబంధం లేదని సినిమా యూనిట్ కోర్టుకు తెలిపారు. అయితే సినిమాలో ఎక్కడా ప్రణయ్, అమృత, మారుతీరావు పేర్లను వాడకూడదంటూ హై కోర్టు సినిమా యూనిట్ కు షరతును విధించింది.

Related News